త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha Krishnan | డిసెంబ‌ర్‌లో రాజ‌కీయాల్లోకి త్రిష‌.. జోష్యం చెప్పిన ఆస్ట్రాల‌జ‌ర్‌

Trisha Krishnan | దక్షిణాది సినీ ఇండ‌స్ట్రీలో రెండు దశాబ్దాలకుపైగా తనదైన ముద్ర వేసిన స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌తో ఆమెకున్న అనుబంధంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జ‌రుగోతంది. తాజాగా త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారంటూ ఓ జ్యోతిష్యుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

P

Entertainment | Published On Oct 18, 2026, 6.52 pm IST

Trisha Krishnan | డిసెంబ‌ర్‌లో రాజ‌కీయాల్లోకి త్రిష‌.. జోష్యం చెప్పిన ఆస్ట్రాల‌జ‌ర్‌
Advertisement

Trisha Krishnan | దక్షిణాది సినీ ఇండ‌స్ట్రీలో రెండు దశాబ్దాలకుపైగా తనదైన ముద్ర వేసిన స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌తో ఆమెకున్న అనుబంధంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జ‌రుగోతంది. తాజాగా త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారంటూ ఓ జ్యోతిష్యుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రదోష్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

త్రిష రాజకీయ భవిష్యత్తుపై జ్యోతిష్యుడు ప్రదోష్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. గ్రహాల కలయిక ఆమెకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలను సూచిస్తోందని పేర్కొన్నారు. సూర్యుడు, కుజుడు, శుక్రుడి కలయిక బలం, ధైర్యం, ఆకర్షణ, ప్రజల్లో ప్రభావాన్ని సూచిస్తుందని వివరించారు. రాహు, కేతువుల సంచారం అనంతరం.. అంటే డిసెంబర్‌ 2026 తర్వాత త్రిష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశారు. గ‌తంలోనూ ప‌లుసార్లు త్రిష అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని, మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకుంటార‌ని కూడా వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారిన నటుడు విజయ్‌తో త్రిషకు ఉన్న పరిచయం, స్నేహం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారాయి. విజయ్‌కు పుట్టినరోజు సందర్భంగా త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన పోస్టు అప్పట్లో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారంటూ పలు వెబ్‌సైట్లలో కథనాలు ప్రచారమయ్యాయి. అయితే, ఈ ప్రచారాన్ని విజ‌య్ సైతం ఖండించిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉండగా.. విజయ్ రాజకీయ విజయానికి, త్రిష పుట్టినరోజుకు మధ్య ఉన్న సమయ సంబంధం కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. విజయ్ విజయానంతరం తిరుపతి వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శించుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

త్రిష, విజయ్‌ల పరిచయం తెరపైనే మొదలైంది. 2004లో వచ్చిన గిల్లి సినిమా వీరిద్దరి కెరీర్‌లో కీలకంగా నిలిచింది. ఆ తర్వాత తిరుపాచి, ఆది, కురువి చిత్రాల్లోనూ కలిసి నటించారు. చాలా ఏళ్ల విరామం తర్వాత లియో సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానుల్లో మంచి స్పందన లభించింది. సినిమాలతో పాటు పలు సందర్భాల్లో వీరిద్దరూ కలిసి కనిపించడం కూడా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. తమ వ్యక్తిగత సంబంధంపై వస్తున్న ఊహాగానాలను ఇద్దరిలో ఎవరూ స్పందించ‌లేదు. విజయ్ రాజకీయ ప్రస్థానం నేపథ్యంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి త్రిష హాజరుకావడం మరింత చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా విజయ్ కుటుంబ సభ్యులతోనూ ఆమె మాట్లాడినట్లు కథనాలు వ‌చ్చాయి. దీంతో విజయ్ రాజకీయ ప్రయాణంలో త్రిష పాత్ర ఏమిటన్న అంశంపై అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా చర్చించుకున్నారు.

ఒకవైపు విజయ్ రాజకీయంగా ఎదుగుతున్న తరుణం.. మరోవైపు త్రిష రాజకీయాల్లోకి వస్తారంటూ జ్యోతిష్య అంచనాలు వెలువడటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న త్రిష రాజకీయాలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది మాత్రం స్పష్టం కాలేదు. ప్రదోష్ చెప్పినట్లుగా డిసెంబర్‌లో ఆమె రాజకీయ అరంగేట్రం చేస్తారా? లేక ఇది మరో ప్రచారంగానే మిగిలిపోతుందా? అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement