త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Extension Orders | సీనియ‌ర్ల‌కు ఎక్స్‌టెన్ష‌న్‌లు ఇస్తూ పోతే జూనియ‌ర్ల సంగ‌తేంటి?

Extension Orders | పదవీ విరమణ పొందిన సీఈ(CE)కి మరోసారి మూడు సీఈ పోస్ట్లులతో ఇచ్చిన ఎక్సటెన్షన్ ఆర్డర్‌ (Extension Orders) ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఇరిగేష‌న్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేష‌న్ (Telangana Irrigation Diploma Engineers Association) నేత‌లు డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Nov 15, 2026, 7.27 pm IST

Extension Orders | సీనియ‌ర్ల‌కు ఎక్స్‌టెన్ష‌న్‌లు ఇస్తూ పోతే జూనియ‌ర్ల సంగ‌తేంటి?
Advertisement
  • సీఈకి ఇచ్చిన ఎక్స్‌టెన్ష‌న్ ఆర్డర్‌ను వెంట‌నే ర‌ద్దు చేయండి
  • మ‌హ‌నీయుల వార‌సులైత‌రో.. ఎక్స్‌టెన్ష‌న్ వీరులైత‌రో చెప్పండి
  • అప్ప‌టిదాకా ప్ర‌తి ఒక్క‌రినీ నిల‌దీస్తం
  • తెలంగాణ ఇరిగేషన్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ నేత‌ల ఘాటు హెచ్చ‌రిక‌

Extension Orders | త్రినేత్ర న్యూస్‌: పదవీ విరమణ పొందిన సీఈ(CE)కి మరోసారి మూడు సీఈ పోస్ట్లులతో ఇచ్చిన ఎక్సటెన్షన్ ఆర్డర్‌ (Extension Orders) ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఇరిగేష‌న్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేష‌న్ (Telangana Irrigation Diploma Engineers Association) నేత‌లు డిమాండ్ చేశారు. ‘మీరు మా మనస్సుల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నవాజ్ జంగ్’ల వంటి మహనీయుల వారసులుగా మిగులుతారా? లేదా ఎక్స్‌టెన్ష‌న్ వీరులుగా మిగులుతారా’? అని ఘాటుగా స్పందించారు. ప్రతి ఒక్కరినీ నిలదీస్తామ‌ని హెచ్చ‌రించారు. పాత ప్రభుత్వం ఇచ్చిన ఎక్సటెన్షన్స్ రద్దు చేసిన సీఎం రేవంత్ ఇంకా ఎవ‌రికీ ఎక్స్‌టెన్ష‌న్ ఆర్డ‌ర్ ఇవ్వ‌మ‌ని మాటిచ్చార‌ని గుర్తు చేశారు. అర్హులైన వారికే ప్ర‌మోష‌న్లు క‌ల్పించాల‌ని.. లేదంటే ఆందోళ‌న‌లు చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు.

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక‌ పదవీ విరమణ పొందిన చీఫ్ ఇంజినీర్లకు ఇంజినీర్ ఇన్ చీఫ్ లకు తిరిగి పదవీ పొడిగింపులు ఇవ్వడం వల్ల జూనియర్ ఇంజినీర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం చీఫ్ ఇంజినీర్ క్యాడర్‌లో వరుసగా ఎస్ఈలకు ప్రమోషన్లు కల్పించి, ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయాల్సిందిపోయి, ప్రభుత్వం రిటైర్ అయిన ఇంజినీర్లనే తిరిగి అదే క్యాడర్ పోస్టుల్లో నియమిస్తోంది. దీనివల్ల పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు ఐదు క్యాడర్లలో ఇంజినీర్ల ప్రమోషన్ అవకాశాలు దెబ్బతింటున్నాయి.

సాగు నీటి శాఖ‌లోనే ఎక్కువ‌

ఎస్ఈ లుగా ఉన్నప్పుడు ఎక్స్‌టెన్షన్‌ల కారణంగా సరైన సమయంలో ప్రమోషన్లు పొందలేకపోయిన వారే, సీఈలుగా ఇంజినీర్ ఇన్ చీఫ్ లుగా పదవీ విరమణ అనంతరం కూడా తిరిగి ఎక్స్‌టెన్షన్‌ల కోసం ప్రయత్నించడం ఆందోళన కలిగించే విషయం. ప్రభుత్వం ఎక్స్‌టెన్షన్లను రద్దు చేస్తామని గతంలో పలుమార్లు హామీలు ఇచ్చినప్పటికీ, వాటిని ప్రభుత్వమే ఉల్లంఘిస్తూ ఎక్స్‌టెన్షన్లు ఇవ్వడం కొనసాగిస్తోంది. ఈ సమస్య అన్ని ఇంజినీరింగ్ శాఖల్లో ఉన్నప్పటికీ, సాగునీటి శాఖలో ఇది తీవ్రమైన సమస్యగా మారింది.

ఇప్పటికే సాగునీటి శాఖలో పలువురు ఇంజినీర్ ఇన్ చీఫ్/చీఫ్ ఇంజినీర్ లకు (అదనంగా ఒక్కటో రెండో పోస్టుల‌ను కూడా అంటే రిటైర్ అయినా వారికీ మూడు సీఈ పోస్టులు లేక‌ ఒక్క సీఈ, ఒక్క ఎస్ఈ పోస్టుల‌తో) పదవీ పొడిగింపులు ఇస్తున్నది. నిన్ననే ఒక‌సారి ఇచ్చిన సీఈకి మూడు సీఈ పోస్టుల‌తో మరో ఆరునెలలు ఎక్స్‌టెన్షన్లు ఇచ్చి కనీసం పదుగురు ఎస్ఈ (SE) లకు సీఈ (CE) ప్రమోషన్ రాకుండా వాళ్ళు ఎస్ఈ లుగానే రిటైర్ అయ్యేలా చేస్తున్నారు. ఈ నెలలో పదవీ విరమణ చేయబోతున్న ఒక సీఈ కూడా ఎక్స్‌టెన్షన్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

తోటి ఇంజినీర్‌లకు అన్యాయం చేసే విధంగా ఎక్స్‌టెన్షన్ల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్స్‌టెన్షన్ తెచ్చుకుని సీఈ/ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా వచ్చినా, సహాయ నిరాకరణ వంటి ప్రజాస్వామ్య పద్ధతులతో నిరసన తెలియజేస్తాం. ఒక అన్న‌లా 2025లో ఇంకా ఎవరికీ ఎక్స్‌టెన్షన్లు ఇవ్వమని మాట ఇచ్చి నిన్ననే ఒక సీఈకే మూడు సీఈ పోస్టులు ఇవ్వడం దారుణం అని హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ‌ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ నేత‌లు మండిప‌డ్డారు.

Advertisement
Advertisement