త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Munnuru Kapu | మున్నూరు కాపుల ఐక్య‌త వ‌ర్ధిల్లాలి

Munnuru Kapu | మున్నూరు కాపుల ఐక్యత, ఆత్మీయత, సంఘటిత శక్తిని చాటేందుకు ఖమ్మం పట్టణంలోని చెరుకువారి తోటలో ఆదివారం నిర్వ‌హించిన మున్నూరు కాపుల కార్తీక వ‌న స‌మారాధ‌న కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మైంది.

S

Telangana | Published On Nov 15, 2026, 7.52 pm IST

Munnuru Kapu | మున్నూరు కాపుల ఐక్య‌త వ‌ర్ధిల్లాలి
Advertisement

Munnuru Kapu | త్రినేత్ర న్యూస్ : మున్నూరు కాపుల ఐక్యత, ఆత్మీయత, సంఘటిత శక్తిని చాటేందుకు ఖమ్మం పట్టణంలోని చెరుకువారి తోటలో ఆదివారం నిర్వ‌హించిన మున్నూరు కాపుల కార్తీక వ‌న స‌మారాధ‌న కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మైంది. కార్తీక మాసం పురస్కరించుకొని రాజ్యసభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి మున్నూరు కాపు నేత‌లు, ప్ర‌ముఖులు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు.

మున్నారు కాపులందరు ఇలా ఒకే వేదికపై కుటుంబ సమేతంగా కలిసి ఈ పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉంది అని వ‌క్త‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. కులబాంధవుల మధ్య ఐక్యత, ఆత్మీయత, పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని వ్యాఖ్యానించారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వీ హ‌నుమంత‌రావు, మాజీ మంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్, జోగు రామ‌న్న‌, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం విన‌య్ భాస్క‌ర్‌, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, పుటం పురుషోత్తం రావుతో పాటు ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement