త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ – ఐఎమ్‌డీబీలో 9.6 రేటింగ్‌

తెలుగు బ‌డ్డీ కామెడీ మూవీ జిగ్రీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. జ‌న‌వ‌రి 6 నుంచి స‌న్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాలో కృష్ణ బూరుగుల‌, రామ్ నితిన్‌, మ‌ణి వాకా, ధీర‌జ్ ఆత్రేయ హీరోలుగా న‌టించారు.

N

Entertainment | Published On Jan 5, 2026, 6.06 pm IST

Telugu OTT | ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ – ఐఎమ్‌డీబీలో 9.6 రేటింగ్‌
Advertisement

Telugu OTT | లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ జిగ్రీస్ థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. బ‌డ్డీ కామెడీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు హ‌రీష్ రెడ్డి ఉప్పాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కృష్ణ బూరుగుల‌, రామ్ నితిన్‌, మ‌ణి వాకా, ధీర‌జ్ ఆత్రేయ హీరోలుగా న‌టించారు.

స‌న్ నెక్స్ట్ ఓటీటీలో...

జిగ్రీస్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. జ‌న‌వ‌రి 6 నుంచి స‌న్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. రిలీజ్ డేట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అఫీషియ‌ల్‌గా ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. జిగ్రీస్ ప్ర‌మోష‌న్స్‌లో డైరెక్ట‌ర్ సందీప్ వంగా పాల్గొన‌డంతో ఈ చిన్న సినిమా ప‌ట్ల తెలుగు ఆడియెన్స్‌లో ఆస‌క్తి ఏర్ప‌డింది. జిగ్రీస్‌ను అర్జున్ రెడ్డితో సందీప్ వంగా పోల్చ‌డం, టీమ్‌తో క‌లిసి స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌డంతో సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డింది.
సందీప్ వంగా ప్ర‌మోష‌న్స్ కార‌ణంగా క‌మ‌ర్షియ‌ల్‌గా జిగ్రీస్ మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. రెండు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఐదు కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 9.6 రేటింగ్‌తో అద‌ర‌గొట్టింది. నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది. జిగ్రీస్ మూవీకి స‌య్య‌ద్ క‌మ్రాన్ మ్యూజిక్ అందించారు.మ్యాడ్‌, మ్యాడ్ స్క్వేర్ కంటే ముందు రామ్ నితిన్ అంగీక‌రించిన మూవీ ఇది. కానీ అత‌డి నాలుగో సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌కు రామ్ నితిన్ దూరంగా ఉన్నారు.

న‌లుగురు స్నేహితుల క‌థ‌...

కార్తిక్, ప్ర‌వీణ్, విన‌య్, ప్ర‌శాంత్ ప్రాణ స్నేహితులు. ప్ర‌శాంత్‌కు క్యాన్స‌ర్ అనే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. స్నేహితుడి కోరిక మేర‌కు న‌లుగురు క‌లిసి త‌మ‌ మారుతి 800 కారులో గోవాకు వెళ్లాల‌ని అనుకుంటారు. డ‌బ్బులు, మొబైల్ లేకుండా ఈ జ‌ర్నీ కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించుకుంటారు. కానీ దారి మ‌ధ్య‌లో వారి కారు ట్ర‌బుల్ ఇస్తుంది. ఆ త‌ర్వాత వారు ఏం చేశారు? గోవా వెళ్లాల‌నే వారి క‌ల నెర‌వేరిందా? తిండికి, కారు రిపేర్‌కు వారు డ‌బ్బులు ఎలా సంపాదించారు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ALSO READ హీరోగా మార‌నున్న అకీరా నంద‌న్ – ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్మాత‌గా డెబ్యూ మూవీ?
Advertisement

తాజావార్తలు

Advertisement