త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ – పెళ్లైన మ‌హిళ‌తో ప్రేమ‌లో ప‌డితే

నందు హీరోగా న‌టించిన సైక్ సిద్దార్థ మూవీ బోల్డ్ కాన్సెప్ట్‌తో యూత్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఫిబ్ర‌వ‌రి 4 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Jan 25, 2026, 7.55 pm IST

Telugu OTT | ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ – పెళ్లైన మ‌హిళ‌తో ప్రేమ‌లో ప‌డితే
Advertisement

Telugu OTT | నందు హీరోగా సైక్ సిద్ధార్థ మూవీ డిఫ‌రెంట్ అటెంప్ట్‌గా నిలిచింది. బోల్డ్ కాన్సెప్ట్‌తో రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు వ‌రుణ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. యామిని భాస్క‌ర్‌, ప్రియాంక రెబెకా హీరోయిన్లుగా న‌టించారు.ఈ బోల్డ్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఫిబ్ర‌వ‌రి 4 నుంచి సైక్ సిద్దార్థ‌ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్‌ను అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన ఆహా ఓటీటీ ఓ పోస్ట‌ర్‌ను అభిమానుతో పంచుకుంది.

హీరోగా...ప్రొడ్యూస‌ర్‌గా...

సైక్ సిద్దార్థ సినిమాలో హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాకు ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు నందు. లిమిటెడ్ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది. యూత్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంది. ఈ చిన్న సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై హీరో రానా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు స్మ‌ర‌ణ్ సాయి మ్యూజిక్ అందించారు.

అఖండ 2 కార‌ణంగా...

తొలుత డిసెంబ‌ర్‌లో 12న ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ స‌డెన్‌గా అఖండ 2 బాక్సాఫీస్ బ‌రిలో నిల‌వ‌డంతో సైక్ సిద్ధార్థ వాయిదా ప‌డింది. సైక్ సిద్ధార్థ తో పాటు నందు విల‌న్‌గా న‌టించిన వ‌న‌వీర కూడా ఒకే రోజు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి.

ప్రియురాలి మోసం...

త్రిష‌ను ప్రేమిస్తాడు సిద్ధార్థ (నందు). ఇద్ద‌రూ క‌లిసి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రారంభిస్తారు. సిద్ధార్థ్‌ను మోసం చేస్తుంది త్రిష‌. బిజినెస్‌లో న‌ష్ట‌పోయిన సిద్ధార్థ రోడ్డుపైకి వ‌స్తాడు. బ‌స్తీలోని ఓ రూమ్ రెంట్‌కు తీసుకొని ఎవ‌రికి క‌నిపించ‌కుండా బ‌తుకుతుంటాడు. అదే బిల్డింగ్‌లోకి శ్రావ్య ( యామిని భాస్క‌ర్‌) అనే అమ్మాయి. భ‌ర్త నుంచి తెగ‌తెంపులు చేసుకొని వ‌చ్చిన శ్రావ్య‌తో సిద్ధార్థ్ ప్రేమ‌లో ప‌డ‌తాడు. శ్రావ్య పరిచ‌యం సిద్ధార్థ జీవితాన్ని ఎలాంటి మ‌లుపులు తిప్పింది? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. గ‌త ఏడాది రిలీజైన దండోరా మూవీతో త‌న పేరును శ్రీనందుగా మార్చుకున్నారు నందు. తెలుగులో హీరోగానే కాకుండా విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ప‌లు సినిమాలు చేశాడు నందు.

Advertisement

తాజావార్తలు

Advertisement