త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prabhas Rajasaab | ప్రభాస్ రాజాసాబ్ అందుకే ఫెయిల‌య్యింది – త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ కామెంట్స్

ప్ర‌భాస్ రాజాసాబ్ ఫెయిల్యూర్‌పై టాలీవుడ్ సీనియ‌ర్ ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. పాన్ ఇండియ‌న్‌గా కాకుండా తెలుగు సినిమాగా వంద కోట్ల‌తో రాజాసాబ్‌ను రూపొందించి ఉంటే లాభాలు వ‌చ్చుండేవ‌ని అన్నారు.

N

Entertainment | Published On Jan 22, 2026, 4.08 pm IST

Prabhas Rajasaab | ప్రభాస్ రాజాసాబ్ అందుకే ఫెయిల‌య్యింది –  త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ కామెంట్స్
Advertisement

Prabhas Rajasaab |ప్ర‌భాస్ హీరోగా న‌టించిన రాజాసాబ్ భారీ డిజాస్ట‌ర్ దిశ‌గా సాగుతోంది. హార‌ర్ కామెడీగా రూపొందిన ఈ మూవీ ఇటీవ‌ల సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మారుతి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రిలీజ్‌కు ముందు సంక్రాంతి సినిమాల్లో రాజాసాబ్ కోస‌మే అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూశారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆక‌ట్టుకోవ‌డం, ప్ర‌మోష‌న్స్‌లో మారుతితో పాటు హీరోయిన్లు చేసిన కామెంట్ల‌తో రాజాసాబ్‌పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ కంటెంట్ వీక్ కావ‌డం, క‌థ‌లో క‌న్ఫ్యూజ‌న్ ఎక్కువ‌గా ఉండ‌టంతో పాటు లెంగ్తీ ర‌న్‌టైమ్ కార‌ణంగా రాజాసాబ్‌ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. దాదాపు 450 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఇప్ప‌టివ‌ర‌కు 200 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. నిర్మాత‌ల‌కు ఈ సినిమా 200 కోట్ల‌కుపైనే న‌ష్టాల‌ను మిగిల్చ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.రాజాసాబ్ ఫెయిల్యూర్‌పై టాలీవుడ్ సీనియ‌ర్ ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

తెలుగు సినిమాగా...

పాన్ ఇండియ‌న్ సినిమాగా కాకుండా కేవ‌లం తెలుగులోనే రీజ‌న‌ల్ మూవీగా వంద కోట్ల బ‌డ్జెట్‌తో తీసుంటే సినిమా పెద్ద హిట్ట‌య్యి ఉండేద‌ని అన్నారు."తొలుత త‌క్కువ బ‌డ్జెట్‌లో కేవ‌లం తెలుగు ఆడియెన్స్ కోస‌మే రాజాసాబ్ తీయాల‌నుకున్నారు. ఆ త‌ర్వాత పాన్ ఇండియ‌న్ సినిమాగా చేయాల‌ని స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేసుకుంటూ వ‌చ్చారు. దాంతో మొద‌ట అనుకున్న క‌థ పూర్తిగా మారిపోయింది. కేవ‌లం వంద కోట్ల బ‌డ్జెట్‌తో తెలుగు సినిమాగా తీసుకుంటే రాజాసాబ్ పెద్ద హిట్ట‌య్యి ఉండేది నిర్మాత‌ల‌కు భారీగా లాభాలు వ‌చ్చుండేవి" అని ఓ ఇంట‌ర్వ్యూలో త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ పేర్కొన్నారు. ఆయ‌న కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.
పాన్ ఇండియ‌న్ పేర్ల‌తో అవ‌స‌రానికి మించి బ‌డ్జెట్‌లు పెడితే ఇలాంటి రిజ‌ల్టే ఉంటుంద‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు. హీరోల రెమ్యూన‌రేష‌న్ల కోస‌మే వంద కోట్ల‌కుపైగా ఖ‌ర్చు చేయ‌డం కూడా పాన్ ఇండియ‌న్ సినిమాల న‌ష్టానికి కార‌ణ‌మ‌ని మ‌రికొంద‌రు పేర్కొంటున్నారు.

సీక్వెల్ డౌటే...

రాజాసాబ్ మూవీలో మాళ‌వికా మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా న‌టించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మించారు. రాజాసాబ్‌కు సీక్వెల్‌ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. రాజాసాబ్ స‌ర్క‌స్ 1935 పేరుతో తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రాజాసాబ్ ఫెయిల్యూర్‌తో ఈ సీక్వెల్ రూపొంద‌డం ఆనుమానంగా మారింది.

Advertisement

తాజావార్తలు

Advertisement