Thamannaah | నిమిషానికి కోటి – తమన్నా డిమాండ్ మామూలుగా లేదుగా!
న్యూ ఇయర్ సందర్భంగా గోవాలో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో తమన్నా అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో ఆహుతులను ఆకట్టుకుంది. ఈ న్యూ ఇయర్ ఈవెంట్‌లో ఆరు నిమిషాల డ్యాన్స్ చేసినందుకు తమన్నా ఆరు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట.
Entertainment | Published On Jan 6, 2026, 7.01 pm IST
Thamannaah | సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల రెమ్యూనరేషన్ తక్కువగానే ఉంటుంది. ఓ హీరోయిన్ నాలుగైదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందంటే హాట్ టాపిక్‌గా మారుతుంది. అందులో సినిమా కోసం ఏడాది వరకు కష్టపడాల్సివుంది. కొన్నిసార్లు రెండు, మూడేళ్లు టైమ్ పడుతుంది. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం నిమిషానికి కోటి రూపాయలు సంపాదించింది. అయితే సినిమాల్లో నటించి కాదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో డ్యాన్స్ చేసినందుకు కోట్లలో ఛార్జ్ చేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు తమన్నా. హీరోయిన్లుగా అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్‌పై దృష్టిపెడుతోంది. రీసెంట్‌గా రిలీజైన బాలీవుడ్ సినిమాలు రైడ్ 2, స్త్రీ 2 సినిమాల్లో ఐటెంసాంగ్స్‌లో అదరగొట్టింది.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో
ఇటీవల తమన్నా గోవాలో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. ఇండియాలోనే టాప్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఈ ఈవెంట్‌ను నిర్వహించిదట. ఈ ఈవెంట్‌లో డ్యాన్స్ చేసినందుకు తమన్నా గట్టిగానే ఛార్జ్ చేసిందట. ఆరు నిమిషాల డాన్స్ చేసినందుకు ఆరు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. నిమిషానికి కోటి రెమ్యూనరేషన్ మిల్కీ బ్యూటీ అందుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ షోలో తమన్నా డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్‌గా అవకాశాలు తగ్గడంతో...
తమన్నా రెమ్యూనరేషన్‌పై నెటిజన్ల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తమన్నా డిమాండ్ మామూలుగా లేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. హీరోయిన్లుగా అవకాశాలు తగ్గడంతో తమన్నా ఈవెంట్లకు అటెండ్ అవుతుందని అంటున్నారు. స్పెషల్ సాంగ్స్‌లో నటించినందుకు కూడా తమన్నా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఒక్కో సాంగ్‌కు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం తమన్నా చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు. గత ఏడాది రిలీజైన ఓదెల 2 తర్వాత మిల్కీ బ్యూటీ కొత్త సినిమాఅంగీకరించలేదు. మరోవైపు హిందీలో ఓ రోమియో సినిమా చేస్తోంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






