త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | గ‌ర్ల్‌ఫ్రెండ్ డైరెక్ట‌ర్‌తో ర‌ష్మిక మంద‌న్న మ‌రో మూవీ – స‌రికొత్త జాన‌ర్‌లో…

Rashmika Mandanna | ది గ‌ర్ల్‌ఫ్రెండ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్న‌, డైరెక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ కాంబినేష‌న్‌లో మ‌రో మూవీ రాబోతుంది. డిఫ‌రెంట్ పాయింట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Dec 20, 2025, 4.49 pm IST

Rashmika Mandanna | గ‌ర్ల్‌ఫ్రెండ్ డైరెక్ట‌ర్‌తో ర‌ష్మిక మంద‌న్న మ‌రో మూవీ – స‌రికొత్త జాన‌ర్‌లో…
Advertisement

Rashmika Mandanna | ర‌ష్మిక మంద‌న్న‌, డైరెక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ది గ‌ర్ల్‌ఫ్రెండ్ (The GirlFriend)మూవీ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే లేడీ ఓరియెంటెడ్ జాన‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna)తొలి అడుగులోనే పెద్ద విజ‌యాన్ని అందుకుంది.
డిఫ‌రెంట్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాలో భూమా పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న యాక్టింగ్‌తో ఇర‌గ‌దీసింది. న‌ట‌న ప‌రంగా ఆమె కెరీర్‌లోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌లో ఒక‌టిగా గ‌ర్ల్‌ఫ్రెండ్ నిలిచిందంటూ అభిమానులు పేర్కొన్నారు. 30 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన గ‌ర్ల్‌ఫ్రెండ్‌ నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది. ప్ర‌శంస‌ల‌తో పాటు కొన్ని విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. ఫెమినిజాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించేలా ఈ మూవీ ఉందంటూ కొంద‌రు నెటిజ‌న్లు ట్రోల్స్ చేశారు.

రెండో సారి...

తాజాగా ది గ‌ర్ల్‌ఫ్రెండ్ కాంబో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ర‌ష్మిక మంద‌న్న‌తో రాహుల్ ర‌వీంద్ర‌న్ సెకండ్ మూవీ చేయ‌బోతున్నాడు. గ‌ర్ల్‌ఫ్రెండ్ షూటింగ్‌లోనే ర‌ష్మిక‌కు రాహుల్ ఓ క‌థ చెప్పాడ‌ట‌. ద‌ర్శ‌కుడు చెప్పిన పాయింట్ న‌చ్చ‌డంతో కూర్గ్ బ్యూటీ ఈ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని రాహుల్ ర‌వీంద్ర‌న్ స్వ‌యంగా వెల్ల‌డించాడు. ప్ర‌స్తుతం ప్రొడ్యూస‌ర్ కోసం అన్వేషిస్తున్నామ‌ని అన్నారు. ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ఫైన‌ల్ అయిన త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్న‌, రాహుల్ ర‌వీంద్ర‌న్ మూవీకి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ట‌. గ‌ర్ల్‌ఫ్రెండ్ మూవీకి భిన్నంగా స‌రికొత్త‌ జాన‌ర్‌లో ఈ మూవీ ఉండ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.
ప్ర‌స్తుతం ర‌ష్మిక తెలుగుతో పాటు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది. తెలుగులో కాబోయే భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా చేస్తోంది. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అలాగే మైసా పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ యాక్ష‌న్ సినిమాలో న‌టిస్తోంది. హిందీలో కాక్ టెయిల్ 2ను అంగీక‌రించింది. వ‌చ్చే ఏడాది ఈ మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ర‌ష్మిక మంద‌న్న పెళ్లి ఫిబ్ర‌వ‌రిలో జ‌రుగ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement