Tollywood | 2025లో గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
2025లో గూగుల్ మోస్ట్ సెర్చ్‌డ్ హీరోయిన్ల లిస్ట్‌లో తమన్నా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ జాబితాలో బాలీవుడ్ నుంచి కియారా అద్వానీ మాత్రమే చోటు దక్కించుకుంది.
Entertainment | Published On Dec 27, 2025, 11.33 am IST
Tollywood | 2025 అంచనాలకు అందకుండా సాగింది. ఈ ఏడాది టాలీవుడ్‌లో ఊహించని మలుపులు ఎన్నో చోటుచేసుకున్నాయి. టాప్ స్లారకు 2025 అంతగా కలిసిరాలేదు. మరోవైపు కొందరు నయా యాక్టర్లు ఓవర్‌నైట్‌లోనే స్టార్లుగా మారారు. 2025 లో చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కొత్త హీరోయిన్ల మెరుపులతో ఈ ఏడాది కలర్‌ఫుల్‌గా సాగింది. నయా అందాల పోటీని తట్టుకొని సీనియర్ హీరోయిన్లు కూడా గట్టిగానే నిలబడ్డారు.
2025లో గూగుల్‌లో ఎక్కువ మంది వెతికిన టాలీవుడ్ హీరోయిన్ల జాబితా బయటకు వచ్చింది. ఈ లిస్ట్‌లో టాప్ హీరోయిన్లను దాటేసిన మిల్కీ బ్యూటీ తమన్నా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ ఏడాది కెరీర్ పరంగా చెప్పుకోదగ్గ విజయాలు లేకపోయినా తమన్నా గురించి నెటిజన్లు తెగ వెతికారట. 2025లో తెలుగులో ఓదెల 2 సినిమా చేసింది. బాలీవుడ్ మూవీ రైడ్ 2లో స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం వీ శాంతారం బయోపిక్‌తో పాటు హిందీలో నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఫ్యాషన్ పరంగా పలు అవార్డులు అందుకోవడం కూడా తమన్నా టాప్‌లో నిలవడానికి కారణమైనట్లు సమాచారం.
నాలుగు బ్లాక్ బస్టర్లు...
తమన్నా తర్వాత గూగుల్ మోస్ట్ సెర్చ్‌డ్ హీరోయిన్ల లిస్ట్‌లో రష్మిక మందన్న సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. టాలీవుడ్, బాలీవుడ్‌లో కలిపి రష్మిక ఈ ఏడాది ఐదు సినిమాలు చేసింది. ఇందులో నాలుగు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ విజయాలతో రష్మిక ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది.
మోస్ట్ సెర్చ్‌డ్ హీరోయిన్ల లిస్ట్‌లో సమంత మూడో ప్లేస్‌లో నిలిచింది. ఇటీవలే ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది సమంత. ఈ రెండో పెళ్లి కారణంగా ఈ ఏడాది సమంత పేరు ఎక్కువగా వినిపించింది. ఈ సీక్రెట్ మ్యారేజ్‌తో పాటు సమంత, రాజ్ నిడిమోరు వ్యక్తిగత జీవితాల గురించి నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారట.
గేమ్ ఛేంజర్...వార్ 2
గూగుల్‌లో 2025లో ఎక్కువ మంది వెతికిన టాప్ ఫైవ్ హీరోయిన్లలో కియారా నాలుగో ప్లేస్‌ను దక్కించుకుంది. ఈ ఏడాది వార్ 2తో పాటు గేమ్ ఛేంజర్ సినిమాలు చేసింది కియారా అద్వానీ. టాలీవుడ్ టాప్ హీరోలతో కియారా చేసిన ఈ రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాలపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ కారణంగా కియారా పేరు తెగ వినిపించింది. మరోవైపు ఈ ఏడాది మాతృత్వ బంధంలోకి అడుగుపెట్టింది. కియారాకు కూతురు పుట్టింది.
గూగుల్ మోస్ట్ సెర్చ్‌డ్ టాలీవుడ్ హీరోయిన్ల లిస్ట్‌లో శ్రీలీల స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది రాబిన్‌హుడ్, మాస్ జాతరతో పాటు కన్నడంలో జూనియర్ సినిమాలు చేసింది శ్రీలీల. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినా శ్రీలీల క్రేజ్‌కు మాత్రం డోకా లేకుండాపోయింది. బాలీవుడ్, కోలీవుడ్‌లో బిజీగా మారింది. ఈ కొత్త సినిమాల కారణంగా శ్రీలీల పేరు అన్ని ఇండస్ట్రీలలో మారుమోగింది.
2025లో గూగుల్ మోస్ట్ సెర్చ్‌డ్ టాలీవుడ్ హీరోయిన్ల లిస్ట్‌లో తమన్నా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ జాబితాలో తమన్నా తర్వాతే రష్మిక, సమంత నిలవడం గమనార్హం.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






