Ma Inti Bangaram | జూన్ 19న రానున్న సమంత ‘మా ఇంటి బంగారం’..
Ma Inti Bangaram | స్టార్ హీరోయిన్ సమంత నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేటా మారింది. మొదట మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా సినిమాను జూన్ 19కి వాయిదా వేసినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది.
Entertainment | Published On May 13, 2026, 7.52 pm IST
Ma Inti Bangaram | స్టార్ హీరోయిన్ సమంత నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేటా మారింది. మొదట మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా సినిమాను జూన్ 19కి వాయిదా వేసినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా సమంత గన్ పట్టుకున్న రగ్డ్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు, అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు టోర్నమెంట్‌ను పూర్తిగా ఆస్వాదించేందుకు అవకాశం కల్పించేందుకే సినిమా విడుదలను మార్చినట్లు వివరించింది.
డిస్ట్రిబ్యూటర్ల సూచనలతో పాటు ఐపీఎల్ ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేసినట్లు పేర్కొంది. ‘ఓ బేబీ’ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. రాజ్ నిడిమోరు ఈ ప్రాజెక్టుకు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో సమంత పాత్ర ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలతో కూడి ఉంటుందని సమాచారం.
View this post on Instagram
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



