Tollywood Heroines | వాట్ నెక్స్ట్ – ఆఫర్ల కోసం టాలీవుడ్ హీరోయిన్ల వెయిటింగ్
కాజల్ అగర్వాల్, తమన్నా, శృతిహాసన్...ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్లుగా కొనసాగారు. తిరుగులేని విజయాలతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మలు ప్రస్తుతం రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. వీరి నెక్స్ట్ తెలుగు మూవీ ఏదన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Entertainment | Published On Jan 24, 2026, 12.29 pm IST
Tollywood Heroines | ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా చెలామణి అయ్యారు. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేశారు. కోట్లలో రెమ్యూనరేషన్లు అందుకున్న హీరోయిన్లు ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్‌కు లాంగ్ గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మల కమ్‌బ్యాక్ ఎప్పుడున్నది ఆసక్తికరంగా మారింది.
కాజల్ అగర్వాల్...
అందాల చందమామ కాజల్ అగర్వాల్ చివరగా 2024లో వచ్చిన సత్యభామ ఐపీఎస్‌తో తెలుగు ఆడియెన్స్‌ను పలకరించింది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో అదరగొట్టింది. అయినా సినిమా మాత్రం కమర్షియల్ హిట్టుగా నిలవలేదు. సత్యభామ ఫెయిల్యూర్ తర్వాత తెలుగులో కాజల్‌కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఈ సినిమా రిలీజై రెండేళ్లు దాటినా టాలీవుడ్‌లో కొత్త సినిమా ఏది అంగీకరించలేదు కాజల్. హీరోయిన్‌గా ఆఫర్లు తగ్గడంతో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న సైడ్ రోల్స్ చేయడానికి రెడీ అంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ రామాయణలో మండోదరి పాత్రలో కనిపించబోతున్నది.
ఘాటీ తర్వాత...
కమర్షియల్ సినిమాలు చేస్తూనే మహిళా ప్రధాన సినిమాలతో టాలీవుడ్‌లోనే తిరుగులేని విజయాలను అందుకుంది అనుష్క శెట్టి. బాహుబలి, మిర్చి. అరుంధతితో పాటు అనుష్క నటించిన పలు తెలుగు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. కెరీర్ పీక్స్‌లో ఉండగా చేసిన కొన్ని ప్రయోగాలు బెడిసికొట్టడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది అనుష్క. రెండేళ్ల గ్యాప్ తర్వాత గత ఏడాది ఘాటితో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ రివేంజ్ యాక్షన్ డ్రామా మూవీతో మళ్లీ తెలుగులో బిజీ కావాలని అనుష్క ఆశపడింది. కానీ ఈ మూవీ డిజాస్టర్‌తో అనుష్క కలలు నెరవేరలేదు. ఘాటీ తర్వాత కొత్త సినిమా ఏది అనౌన్స్‌చేయలేదు.
ఏడాది దాటిపోయింది...
మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి ఏడాది దాటిపోయింది. 2025లో వచ్చిన ఓదెల 2 తర్వాత తెలుగులో తమన్నా కొత్త సినిమా ఏది విడదల కాలేదు. యంగ్ హీరోయిన్ల దూకుడుతో పాటు పరాజయాల కారణంగా తెలుగులో తమన్నా డౌన్‌ఫాల్ మొదలైంది. హిందీ, తమిళంతో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. కమల్‌హాసన్ తనయగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శృతిహాసన్ గబ్బర్‌సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు వంటి సినిమాలతో పెద్ద విజయాలను అందుకుంది. ఒకప్పుడు ఏడాదికి నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం జోరు తగ్గించింది. క్వాంటిటీ కంటే క్వాలిటీకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తోంది. 2023లో రిలీజైన సలార్ తర్వాత తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. టాలీవుడ్‌లోకి శృతిహాసన్ రీఎంట్రీ ఎప్పుడన్నది ఆసక్తికరంగా మారింది.
వీళ్లే కాకుండా రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్ మరికొంతమంది సీనియర్ హీరోయిన్లు రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.
సంబంధిత వార్తలు

Rakul Preet Singh | ప్రభాస్ సినిమా నుంచి నన్ను తీసేశారు – రకుల్ కామెంట్స్…
మే 8, 2026

Kajal Aggarwal | నయన్ పోయే…కాజల్ వచ్చే – బాలకృష్ణ సినిమాలో ట్విస్ట్
మే 2, 2026

Bhagyashri Borse | టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేసులో వెనుకపడ్డ భాగ్యశ్రీ..! ఒక్క బ్రేక్ వస్తే చాలు..!
ఏప్రిల్ 29, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



