త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhagyashri Borse | టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేసులో వెనుకపడ్డ భాగ్యశ్రీ..! ఒక్క బ్రేక్ వ‌స్తే చాలు..!

Bhagyashri Borse | తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయిక స్థానం కోసం కొనసాగుతున్న పోటీలో భాగ్యశ్రీ బోర్సేకే ఆశించిన స్థాయిలో బ్రేక్ దొరకడం లేదు. భారీ అంచనాలతో వచ్చినా ‘కింగ్‌డమ్’, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వంటి సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆమె కెరీర్‌పై ప్రభావం పడింది. ప్రస్తుతం తమిళ చిత్రాల్లో అవకాశాలు వెతుకుతున్న ఆమె మళ్లీ బలంగా రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం తెలుగులో ‘లెనిన్‌’లో నటిస్తుండగా.. ఈ మూవీలో భారీ ఆశలు పెట్టుకుంది.

P

Entertainment | Published On Apr 29, 2026, 2.35 pm IST

Bhagyashri Borse | టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేసులో వెనుకపడ్డ భాగ్యశ్రీ..! ఒక్క బ్రేక్ వ‌స్తే చాలు..!
Advertisement

Bhagyashri Borse | యువ కథనాయికల కోసం టాలీవుడ్‌ మరోసారి ఎదురుచూస్తోంది. గతంలో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా కొనసాగిన పూజా హెగ్డే ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి. దాంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే యువ హీరోయిన్‌ ఎవరు అన్న ప్రశ్న ఇండస్ట్రీలో మళ్లి వినిపిస్తోంది. ఈ రేసులో తొలుత శ్రీలీల పేరు బలంగా వినిపించింది. వరుస అవకాశాలు, డ్యాన్స్‌ స్కిల్స్‌తో త్వరలోనే టాప్‌ హీరోయిన్‌గా ఎదిగే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. పలు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆ ఊపు తగ్గినట్లుగా కనిపిస్తోంది. కమర్షియల్‌ సక్సెస్‌ లేకపోవడంతో కెరీర్‌కు కొంత బ్రేకులు పడ్డాయనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. ఈ పరిస్థితుల్లో తెరపైకి భాగ్యశ్రీ బోర్సే పేరు తెరపైకి వచ్చింది.

2023 హిందీలో యారియాన్‌-2తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2024లో తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్‌ బచ్చన్‌ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో మరాఠా బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షించింది. అందంతో పాటు తన అభినయంతోనూ ఆకట్టుంది. ఆ తర్వాత కింగ్‌డమ్‌, కాంతా, ఆంధ్రాకింగ్‌ సినిమాల్లో నటించింది. ఆయా సినిమాలతో ఆమె కెరీర్‌ మలుపు తిరుగుతుందని భావించారు. కానీ, ఈ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆయా సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్‌ కాకపోవడంతో భాగ్యశ్రీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీకి ఒక్క కమర్షియల్‌ హిట్‌ లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. సరైన ప్రతిభ ఉన్నా బ్రేక్‌ దొరక్కపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా అవకాశాలు మాత్రం దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది.

ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ వైపు సైతం దృష్టి సారించింది. సరైన హిట్ దొరికితే ఆమె మళ్లీ టాప్ రేసులోకి వచ్చే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం తమిళంలో ఓ ప్రాజెక్టులో నటిస్తోంది. ప్రస్తుతం భాగ్యశ్రీ తెలుగులో ‘లెనిన్‌’ మూవీలో అక్కినేని అఖిల్‌తో జతకడుతోంది. యాక్షన్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ భాగ్యశ్రీ భారీ ఆశలు పెట్టుకోంది. ఈ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీకి కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీని జూన్‌ 25న రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావించారు. అయితే, రామ్‌ చరణ్‌ పెద్ది రిలీజ్‌ నేపథ్యంలో రిలీజ్‌ని వాయిదా వేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీని జులై చివరలో లేదంటే ఆగస్టు 15 వీకెండ్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement