Taapsee | సెట్స్‌లో బ్రా వేసుకోమనేవారు – సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ సంచలన కామెంట్స్
దక్షిణాది సినిమాలపై తాప్సీ మరోసారి వివాదాస్పదన కామెంట్లు చేసింది. షూటింగ్‌లలో బ్రా ధరించి కనిపించమని దర్శకులు బలవంతపెట్టేవారని తాప్సీ అన్నది. హీరోయిన్ల క్లీవేజ్ షోపైనే దర్శకులు ఎక్కువగా ఫోకస్ పెట్టేవారని అన్నది.
Entertainment | Published On Feb 22, 2026, 11.40 am IST
Taapsee | తెలుగు సినిమాలతో కెరీర్‌ను మొదలుపెట్టి ఆపై బాలీవుడ్ బాట పట్టింది తాప్సీ. మంచు మనోజ్ హీరోగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మందినాదం సినిమాతో హీరోయిన్‌గా మారింది తాప్సీ. ప్రభాస్ మిస్టర్ పర్‌ఫెక్ట్‌తో పాటు మొగుడు, దరువు, గుండెల్లో గోదారితో పాటు తెలుగులో చాలానే సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో దక్షిణాది సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తాప్సీ తెలుగులో సినిమా చేసి ఐదేళ్లు దాటిపోయింది. టాలీవుడ్‌లో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన తాప్సీ దక్షిణాదిలో మాత్రం యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న పవర్‌ఫుల్ రోల్స్ చేస్తోంది. తాప్సీ హీరోయిన్‌గా నటించిన అస్సీ మూవీ ఇటీవల రిలీజైంది. కోర్టు రూమ్‌డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో లాయర్‌గా తాప్సీ నటనకు ప్రశంసలు లభిస్తోన్నాయి. ఈ మూవీ ప్రమోషన్స్‌లో దక్షిణాది సినీ పరిశ్రమపై తాప్సీ సంచలన కామెంట్స్ చేసింది.
బ్రా ధరించమని అనేవారు...
దక్షిణాది సినిమాల్లో చేస్తున్నప్పుడు చాలా సార్లు ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తాప్సీ చెప్పింది. "బొద్దుగా ఉన్న హీరోయిన్లనే ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడతారనే అపోహ దక్షిణాదిలో ఉంది. దాంతో హీరోయిన్లను అలాగే చూపించాలని దర్శకులు అనుకునే వారు. సెట్స్‌లో అందరి ముందే హీరోయిన్ల ఫిజిక్, లుక్స్‌పై కామెంట్లు చేసేవారు. షూటింగ్‌లో బ్రా ధరించమని అనేవారు. కానీ ఆ విషయాన్ని నేరుతో నాతో చెప్పడానికి కూడా దర్శకులు ఇబ్బందిపడేవారు. డైరెక్టర్ చెప్పినట్లు బ్రా వేసుకొని కారావ్యాన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సెట్స్‌లో ఉన్న వారందరి దృష్టి నాపైనే ఉండేది. చాలా అసౌకర్యంగా అనిపించేది. అలాంటి పరిస్థితులు చాలా సార్లు ఎదుర్కొన్నా" అని తాప్సీ అన్నది.
క్లీవేజ్ షాట్స్...
బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది సినిమాల్లో హీరోయిన్లను చూపించే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటుందని తాప్సీ అన్నది. "పాటల్లో మ్యూజిక్, సాహిత్యం కంటే కంటే హీరోయిన్ల బొడ్డును చూపించడం, క్లీవేజ్ షాట్స్‌పైనే దర్శకులు ఎక్కువగా ఫోకస్ పెట్టేవారు. హీరోయిన్ అంటే గ్లామర్ షో కోసమే అనే భావన కనిపిస్తుంది. బాలీవుడ్‌లో అలా ఉండదని" తాప్సీ అన్నది. ఆమె కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
దక్షిణాది సినిమాపై తాప్సీ నోరుపారేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇలాంటి విమర్శలు చేసింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



