త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Taapsee Pannu Picks PM Modi over Rahul Gandhi | రాహుల్ గాంధీనా? మోదీనా? మీ ఫేవరెట్ ఎవరు? తాప్సీ సమాధానం విని షాకైన యాంకర్!

బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్నుకు లైవ్ టీవీలో ఒక ఇబ్బందికరమైన ప్రశ్న ఎదురైంది. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలలో మీకు నచ్చిన నాయకుడు ఎవరని అడిగితే.. ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

J

Movies | Published On Feb 15, 2026, 7.30 pm IST

Taapsee Pannu Picks PM Modi over Rahul Gandhi | రాహుల్ గాంధీనా? మోదీనా? మీ ఫేవరెట్ ఎవరు? తాప్సీ సమాధానం విని షాకైన యాంకర్!
Advertisement

Taapsee Pannu Picks PM Modi over Rahul Gandhi | త్రినేత్ర.న్యూస్ : బాలీవుడ్ నటి తాప్సీ పన్ను తన ముక్కుసూటితనానికి పెట్టింది పేరు. ఏ విషయంపైనైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ఆమె, తాజాగా ఓ టీవీ షోలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజకీయ నాయకులపై అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అటు ప్రేక్షకులను, ఇటు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.

అసలేం జరిగింది?

టీవీ9 భారత్‌వర్ష్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తాప్సీని యాంకర్ ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. "మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు? నరేంద్ర మోదీనా లేక రాహుల్ గాంధీనా?" అని ప్రశ్నించారు. దానికి తాప్సీ క్షణం కూడా ఆలోచించకుండా.. "నరేంద్ర మోదీ" అని సమాధానం ఇచ్చారు. అయితే, ఆమె అంతటితో ఆగలేదు. మోదీని ఎంచుకోవడానికి గల కారణాన్ని చెబుతూ.. "నేను ఇంకా ఈ దేశంలోనే బతకాలి కదా" (Mujhe abhi bhi is desh mein rehna hai) అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఆమె సమాధానం వినగానే అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు. ఇది కేవలం సరదాగా అన్నారా లేక పరోక్షంగా సెటైర్ వేశారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

స్మృతి ఇరానీకే ఓటు

అంతకుముందు, "మీకు నచ్చిన మహిళా నేత ఎవరు?" అనే ప్రశ్నకు మమతా బెనర్జీ, స్మృతి ఇరానీ, మాయావతి, ప్రియాంక గాంధీ పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు. దానికి తాప్సీ, సుష్మా స్వరాజ్ పేరును ప్రస్తావించినప్పటికీ, ఇచ్చిన ఆప్షన్లలో స్మృతి ఇరానీని ఎంచుకున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు ఆమె చమత్కారానికి ఫిదా అవుతున్నారు. ఏది ఏమైనా, తాప్సీ సమాధానం మాత్రం "రోస్టింగ్ వితౌట్ రోస్టింగ్" (తిట్టకుండానే చురకలు అంటించడం) లా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

https://x.com/erbmjha/status/2022989356060037548

 

Advertisement

తాజావార్తలు

Advertisement