త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Taapsee Pannu | నిర్మాత‌ల‌పై ఫైర్ అయిన తాప్సీ.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

Taapsee Pannu | ఇటీవ‌ల స్టార్ హీరోల భారీ స‌పోర్టింగ్ టీమ్ కార‌ణంగా నిర్మాత‌ల‌కు ఖ‌ర్చులు పెరుగుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. హీరోల‌తో పాటు సిబ్బంది ఖ‌ర్చులు త‌డిసిమోపెడ‌వుతున్నాయ‌ని ఆరోపిస్తున్నారు. దానిపై బాలీవుడ్ బ్యూటీ తాప్సీ ప‌న్ను స్పందించింది.

P

Entertainment | Published On Mar 11, 2026, 8.45 pm IST

Taapsee Pannu | నిర్మాత‌ల‌పై ఫైర్ అయిన తాప్సీ.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?
Advertisement

Taapsee Pannu | ఇటీవ‌ల స్టార్ హీరోల భారీ స‌పోర్టింగ్ టీమ్ కార‌ణంగా నిర్మాత‌ల‌కు ఖ‌ర్చులు పెరుగుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. హీరోల‌తో పాటు సిబ్బంది ఖ‌ర్చులు త‌డిసిమోపెడ‌వుతున్నాయ‌ని ఆరోపిస్తున్నారు. దానిపై బాలీవుడ్ బ్యూటీ తాప్సీ ప‌న్ను స్పందించింది. ఈ ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని తాప్సీ స్ప‌ష్టం చేసింది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త‌న‌కు ఇండ‌స్ట్రీలో బ‌డా స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేసిన అనుభ‌వం ఉంద‌ని, ముఖ్యంగా షారుక్ ఖాన్‌, అక్ష‌య్ కుమార్‌, అమితాబ్ బ‌చ్చ‌న్ త‌దిత‌ర ప్ర‌ముఖ‌ల‌తో క‌లిసి చేశాన‌ని తెలిపింది. ఆ స‌మ‌యంలో హీరోల స‌పోర్టింగ్ స్టాఫ్ పెద్ద‌గా క‌నిపించ‌లేద‌ని పేర్కొంది. ప్ర‌తి న‌టుడికి భారీగా సపోర్టింగ్ స్టాఫ్ ఉంటార‌నేది కేవ‌లం అపోహ మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. ఈ అంశంపై విమ‌ర్శ‌లు చేస్తున్న నిర్మాత‌ల‌కు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది. అలాంటి హీరోల‌కు సినిమాల్లో అవ‌కాశాలు ఇచ్చేది వాళ్ల‌లేన‌ని తెలిపింది.

నటులు అంత డిమాండ్ చేస్తున్నార‌ని చెబుతార‌ని, మ‌ళ్లీ వాళ్ల‌నే తీసుకుంటార‌ని గుర్తు చేసింది. నిజంగా స‌మ‌స్య‌గా ఉంటే దాన్ని మార్చాల‌ని.. లేక‌పోతే ఆరోప‌ణ‌లు చేయ‌కూడ‌ద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసింది. ఇటీవ‌ల సిబ్బంది ఖ‌ర్చులు సినిమా బ‌డ్జెట్‌పై ప్ర‌భావం చూపుతుంద‌న్న చ‌ర్చ ఇటీవ‌ల జ‌రుగుతోంది. ఇప్ప‌టికీ ఈ అంశంపై ఇప్పటికే వ‌రుణ్ ధావ‌న్‌, కృతి స‌న‌న్‌, జాన్ అబ్ర‌హం, జాకీ ష్రాఫ్ త‌దిత‌ర స్టార్స్ స్పందించారు. చాలామంది హీరోల‌కు పెద్ద‌గా సిబ్బంది అవ‌స‌రం ఉండ‌ద‌ని.. అయితే, కొంద‌రు వ్య‌క్తిగ‌త‌, ప్రొఫెష‌న‌ల్ కార‌ణాల‌తో టీమ్‌ని త‌మ వెంట పెట్టుకుంటార‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా.. తాప్సీ సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు అనుభ‌వ్ సిన్హా తెర‌కెక్కించిన అస్సీ చిత్రంలో క‌నిపించింది. ఈ మూవీ దేశంలో జరిగిన అత్యాచార ఘటనల నేపథ్యంతో తెరకెక్కింది. త్వరలోనే ఆమె నటించిన గాంధారి చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ది.

Advertisement
Advertisement