త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Taapsee Pannu | ఆ మూవీల్లో న‌టించేందుకు హీరోలు భ‌య‌ప‌డుతున్న‌రు : తాప్సీ ప‌న్ను

Taapsee Pannu | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ తాప్సీ ప‌న్ను గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల సినీ ఇండ‌స్ట్రీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తోంది. ముఖ్యంగా హీరోలను ప్ర‌స్తావిస్తూ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి. హీరోల అభ‌ద్ర‌తా భావంపై చేసిన వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

P

Entertainment | Published On Mar 18, 2026, 8.49 pm IST

Taapsee Pannu | ఆ మూవీల్లో న‌టించేందుకు హీరోలు భ‌య‌ప‌డుతున్న‌రు : తాప్సీ ప‌న్ను
Advertisement

Taapsee Pannu | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ తాప్సీ ప‌న్ను గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల సినీ ఇండ‌స్ట్రీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తోంది. ముఖ్యంగా హీరోలను ప్ర‌స్తావిస్తూ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి. హీరోల అభ‌ద్ర‌తా భావంపై చేసిన వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజాగా ఇంట‌ర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ హీరోలు ఎందుకు కొన్ని కథలకు దూరంగా ఉంటారో వివరించింది. కథానాయిక పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించడంలో చాలామంది అగ్ర హీరోలు ఆసక్తి చూపడంలేదని తెలిపింది. తాను ఎదుర్కొన్న సంఘటన గురించి వివ‌రించింది. ఓ సినిమాలో తాను డ‌బుల్ రోల్ చేస్తున్న స‌మ‌యంలో.. ఆ ప్రాజెక్ట్‌లో ఓ ప్రముఖ హీరో త‌న‌ను తిర‌స్క‌రించాడ‌ని తెలిపింది.

కార‌ణం ఏంటంటే మూవీలో హీరోయిన్ పాత్ర‌కు ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంటే అభిమానుల ప్ర‌శంస‌లు ఆమె వెళ్తాయేమోన‌ని భ‌య‌ప‌డ్డాడ‌ని వ్యాఖ్యానించింది. ఇప్ప‌టికే తాను ఆ హీరోతో ప‌ని చేశాన‌ని. త‌న పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత లభించే అవకాశం ఉందని భయపడి వెనక్కి తగ్గడం నన్ను ఆశ్చర్యపరిచింద‌ని తాప్సీ తెలిపింది. కేవలం సీనియర్ హీరోలే కాకుండా.. కొత్త‌గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన యువ హీరోలు కూడా డామినెంట్ పాత్రలు కాదన్న కారణంతో కొన్ని క‌థ‌ల‌కు దూరంగా ఉంటున్నార‌ని తెలిపింది. హీరోయిన్ల ప్రధాన పాత్ర భయంతో మంచి కథలను వదులుకోవడం, పరిశ్రమలో సమానత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తుంద‌ని పేర్కొంది. తాప్సీ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement