త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priya Kapoor | రూ.30వేల కోట్ల ఆస్తి వివాదం.. బాలీవుడ్ న‌టి క‌రిష్మా స్పంద‌న కోరిన సుప్రీంకోర్టు..!

Priya Kapoor | రూ.30వేల కోట్ల ఆస్తి వివాదంలో దివంగత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ మూడో భార్య ప్రియా క‌పూర్ సుప్రీంకోర్టు త‌లుపుత‌ట్టారు. బాలీవుడ్ న‌టి క‌రిష్మా క‌పూర్‌ను సంజ‌య్ క‌పూర్ రెండో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు 2016లో విడాకులు తీసుకున్నారు.

P

Entertainment | Published On Jan 16, 2026, 8.29 pm IST

Priya Kapoor | రూ.30వేల కోట్ల ఆస్తి వివాదం.. బాలీవుడ్ న‌టి క‌రిష్మా స్పంద‌న కోరిన సుప్రీంకోర్టు..!
Advertisement

Priya Kapoor | రూ.30వేల కోట్ల ఆస్తి వివాదంలో దివంగత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ మూడో భార్య ప్రియా క‌పూర్ సుప్రీంకోర్టు త‌లుపుత‌ట్టారు. బాలీవుడ్ న‌టి క‌రిష్మా క‌పూర్‌ను సంజ‌య్ క‌పూర్ రెండో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు 2016లో విడాకులు తీసుకున్నారు. అయితే, విడాకుల కేసుకు సంబంధించిన స‌ర్టిఫైడ్ ప‌త్రాలు ఇప్పించాల‌ని ప్రియా కోర్టుకు విజ్ఞ‌ప్తి చేశారు. విడాకుల స‌మ‌యంలో కుదిరిన రాజీ ఒప్పందం వివ‌రాలు, పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకోవ‌డ‌మే త‌న పిటిష‌న్ ఉద్దేశ‌మ‌ని పేర్కొన్నారు. ప్రియా కపూర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నటి కరిష్మా కపూర్ స్పంద‌న కోరింది.

గతేడాది జూన్‌లో సంజయ్ కపూర్ బ్రిటన్‌లో పోలో అక‌స్మాత్తుగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం ఓ వీలునామా బ‌య‌ట‌ప‌డింది. ఇదే వివాదానికి కార‌ణ‌మైంది. వీలునామా ప్ర‌కారం.. సంజ‌య్ క‌పూర్ త‌న యావ‌దాస్తిని త‌న భార్య ప్రియాక‌పూర్‌కే రాసి ఇచ్చారు. అయితే, కరిష్మా పిల్లలు సమైరా, కియాన్ దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. వీలునామా ఫోర్జ‌రీ చేశార‌ని.. అందులో త‌న తండ్రి సంత‌కం లేద‌ని ఆరోపించారు. ఈ అంశంపై ఇప్ప‌టికే ఢిల్లీ హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న‌ది. ప్రియా క‌పూర్‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌రిష్మా పిల్ల‌లు కోర్టును కోరారు.

వీలునామాలో పిల్ల‌ల పేర్లు త‌ప్పుగా ఉండ‌డంతో.. ఉన్న‌త చ‌దువులు చ‌దివిన వ్య‌క్తి అలా చేసే అవ‌కాశం లేదంటూ వాద‌న‌లు వినిపిస్తున్నారు. మ‌రో వైపు సంజ‌య్ క‌పూర్ త‌ల్లి రాణి క‌పూర్ సైతం క‌రిష్మా పిల్ల‌ల‌కే మ‌ద్ద‌తు తెలిపింది. అయితే, ఈ ఆరోపణలను ప్రియా కపూర్ ఖండిస్తున్నారు. సంజయ్ మరణం తర్వాత పిల్లల విలాసవంతమైన జీవనశైలి కోసం తాను రూ.96 లక్షల వరకు ఖర్చు చేశానని ఆమె న్యాయ‌స్థానానికి తెలిపారు. స్పెల్లింగ్ తప్పులు ఉన్నంత మాత్రాన వీలునామా ఫోర్జరీ అని చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని న్యాయ‌వాదులు కోర్టుకు తెలిపారు. తాజాగా సుప్రీంకోర్టులో ప్రియా పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు స్పంద‌న కోరింది.

ఇదిలా ఉండ‌గా సంజ‌య్ క‌పూర్ సోద‌రి మాత్రం సైతం క‌రిష్మాకే మ‌ద్ద‌తు తెలిపింది. ప‌లు విష‌యాల నుంచి దృష్టి మ‌ళ్లించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. ప్రియా ఇదంతా ఎందుకు చేస్తుందో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని.. విడాకుల అంశం క‌రిష్మా, సంజ‌య్ మ‌ధ్య గోప్య‌మైన విష‌య‌మ‌న్నారు. వ్యాపార‌వేత్త అయిన సంజ‌య్ క‌పూర్‌కి ముగ్గురు భార్య‌లు. తొలుత ఆయ‌న నందితా మహతాని 1996లో పెళ్లి చేసుకుని 2000 సంవ‌త్స‌రంలో విడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న 2003లో క‌రిష్మా క‌పూర్‌ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు సంతానం ఉన్నారు. 2016లో ఇద్ద‌రు విడిపోయారు. 2017లో ఆయ‌న ప్రియా స‌చ్‌దేవ్‌ను మూడో వివాహం చేసుకున్నారు. వీరిద్ద‌రికి అజారియాస్ అనే కొడుకు ఉన్నాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement