Vakiti Srihari | ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మారుస్తం
Vakiti Srihari | ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చే అంశంపై తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ధైర్యం ఉన్నాయని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) పేర్కొన్నారు.
- పాలమూరు యూనివర్సిటీకి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు పండుగ సాయన్న పేరు పెట్టాలి
- పండుగ సాయన్న జయంతి వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి
Vakiti Srihari | త్రినేత్ర న్యూస్: ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చే అంశంపై తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ధైర్యం ఉన్నాయని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) పేర్కొన్నారు. ముదిరాజ్‌లకు న్యాయం చేయాలనే ఆకాంక్షతో పాటు, బీసీ-ఏలో ఇప్పటికే ఉన్న మత్స్యకారులకు ఎలాంటి నష్టం, ఇబ్బంది కలగకుండా పరిష్కారం చూపాల్సిన బాధ్యత కూడా తమపై ఉందన్నారు. పాలమూరు యూనివర్సిటీకి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు పండుగ సాయన్న (Panduga Sayanna) పేరు పెట్టాలని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. మహనీయుల చరిత్రను గౌరవించడం, అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం, సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపించడం కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువారం నిర్వహించిన పండుగ సాయన్న 174వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
పండుగ సాయన్న ఆశయాలకు అనుగుణంగా ముదిరాజ్‌ల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. పండుగ సాయన్న వంటి మహనీయుల చరిత్రను గుర్తించి, వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం ద్వారా సమాజానికి వారి సేవలను పరిచయం చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పండుగ సాయన్న జయంతి వేడుకలను నిర్వహిస్తూ ఆయనకు తగిన గుర్తింపు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
హక్కుల విషయంలో ముందుకే
రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించాలంటే ప్రతి కులం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వారి జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేపట్టిందని తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయమైన వాటా, సమాన అవకాశాలు కల్పించాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. ఒక వర్గానికి న్యాయం చేస్తూ మరో వర్గానికి అన్యాయం జరగకుండా, అందరి ప్రయోజనాలను పరిరక్షించే విధంగా తగిన అవకాశాలు కల్పించాలని తెలిపారు.
పండుగ సాయన్న పేరు కేవలం ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదని, అది పోరాట స్ఫూర్తికి, ఆత్మగౌరవానికి, సామాజిక చైతన్యానికి ప్రతీక అని మంత్రి అభిప్రాయపడ్డారు. చరిత్రలో సముచిత స్థానం దక్కాల్సిన మహనీయుల పేర్లను విద్యాసంస్థలు, ప్రాంతాలకు పెట్టడం ద్వారా వారి త్యాగాలు, పోరాటాలను భవిష్యత్ తరాలకు అందించవచ్చన్నారు. పండుగ సాయన్నకు తగిన గౌరవం కల్పించడం ద్వారా ముదిరాజ్‌ల సామాజిక ఆత్మగౌరవానికి మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.
చిరస్థాయిగా నిలిచేలా
పండుగ సాయన్న చరిత్రను స్మరించుకోవడం ఒక వేడుకకే పరిమితం కాకూడదని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. మహనీయులను గుర్తించడం, వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడం, వారి హక్కులకు భరోసా ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా భావిస్తోందని తెలిపారు. ముదిరాజ్‌ల అభ్యున్నతి, బీసీలకు న్యాయమైన వాటా, మహనీయులకు సముచిత గౌరవం అనే అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతోందని మంత్రి వాకిటి పేర్కొన్నారు. పండుగ సాయన్నకు తగిన గుర్తింపు కల్పించడంతో పాటు, ఆయన పేరు పాలమూరు ప్రజల గుండెల్లోనే కాకుండా విద్యాసంస్థలు, ప్రాంతాల ద్వారా కూడా చిరస్థాయిగా నిలిచేలా చర్యలు తీసుకోవాలన్నదే తమ ఆకాంక్షని వెల్లడించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Saudi Airport | సౌదీ ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు మృతి
- ●Honey Trap | మాజీ లవర్‌తో చేతులు కలిపి.. 12 మంది సీఐలు, ఇద్దరు అదనపు డీసీపీలను బురిడీ కొట్టించి
- ●Acer TravelLite TL44-53M-G2 | ఏసర్ నుంచి కొత్త బిజినెస్ ల్యాప్‌టాప్.. తక్కువ ధర.. ఫీచర్లు ఎక్కువ..
- ●Jailer 2 | జైలర్ 2 టికెట్లు ఫ్రీ - విద్యుత్ కోతలపై తమిళనాడు కౌన్సిలర్ వెరైటీ నిరసన
- ●PM Modi Donald Tusk Meeting | భారత్‌తో పోలాండ్ కీలక డీల్.. ఈ 3 రంగాల్లో ఇక తిరుగుండదు!
- ●Adilabad CCI | ఇక ఆదిలాబాద్ సీసీఐ కనుమరుగు.. స్థానికుల ఆవేదన

Saudi Airport | సౌదీ ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు మృతి

Honey Trap | మాజీ లవర్‌తో చేతులు కలిపి.. 12 మంది సీఐలు, ఇద్దరు అదనపు డీసీపీలను బురిడీ కొట్టించి

Acer TravelLite TL44-53M-G2 | ఏసర్ నుంచి కొత్త బిజినెస్ ల్యాప్‌టాప్.. తక్కువ ధర.. ఫీచర్లు ఎక్కువ..

Jailer 2 | జైలర్ 2 టికెట్లు ఫ్రీ - విద్యుత్ కోతలపై తమిళనాడు కౌన్సిలర్ వెరైటీ నిరసన






