Srinidhi Shetty | నాలుగేళ్ల తర్వాత మాతృభాషలో సినిమా – ఖాకీ డ్రెస్‌లో కేజీఎఫ్ హీరోయిన్
నాలుగేళ్ల తర్వాత మాతృభాష కన్నడంలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి సినిమా చేయబోతుంది. అనుప్ భండారీ దర్శకత్వంలో రూపొందుతోన్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో మాస్ పోలీస్ ఆఫీసర్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Aug 16, 2026, 3.11 pm IST
Srinidhi Shetty | రష్మిక మందన్న, శ్రీనిధి శెట్టితో పాటు పలువురు అగ్రనాయికల సినీ ప్రయాణం కన్నడంలోనే మొదలైంది. ఇతర భాషల్లో స్టార్స్‌గా మారిన వీరు మాతృభాషకు దూరమయ్యారు. రష్మిక మందన్న కన్నడంలో సినిమా చేసి పదేళ్లు దాటిపోయింది. కేజీఎఫ్‌తో కన్నడంలో ఫేమస్ అయిన శ్రీనిధిశెట్టి ఆ తర్వాత తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేసింది. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ మాతృభాషలో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది శ్రీనిధి శెట్టి.
సైకలాజికల్ థ్రిల్లర్...
అనుప్ భండారీ దర్శకత్వంలో అతడి సోదరుడు నిరుప్ భండారీ హీరోగా కన్నడంలో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న నాలుగో సినిమా ఇది. ఇటీవలే ఈ సాండల్‌వుడ్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టిని మేకర్స్ ఫైనల్ చేశారు.
ప్రయోగం...
రొమాంటిక్ ట్రాక్స్, డ్యూయెట్స్ లేకుండా ప్రయోగాత్మకంగా దర్శకుడు అనుప్ భండారీ ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నట్లు సమాచారం. ఇందులో నిరుప్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతుండగా...శ్రీనిధి శెట్టి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో శ్రీనిధి లుక్ కొత్తగా ఉండబోతున్నట్లు సమాచారం. మాస్ పాత్రలో రఫ్ అండ్ టఫ్‌గా ఉంటుందని అంటున్నారు.
ఆదర్శ కుటుంబం...
హిట్ 2 మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీనిధి శెట్టి. ఈ సినిమాలో నానికి జోడీగా నటించింది. ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదాలో కథానాయికగా కనిపించింది. ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఆదర్శకుటుంబంలో హీరోయిన్‌గా నటిస్తోంది శ్రీనిధి శెట్టి. ఈ సినిమాలో వెంకటేష్ భార్య పాత్రను పోషిస్తుంది. ఫన్ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nabha Natesh | నభానటేష్ కెమిస్ట్రీ – తొమ్మిదేళ్ల తర్వాత మాతృభాషలోకి ఇస్మార్ట్ బ్యూటీ రీఎంట్రీ
అక్టోబర్ 6, 2026

Aadarsha Kutumbam Postpone | వెంకటేష్ ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా – అక్టోబర్ రేసు నుంచి ఔట్?
అక్టోబర్ 5, 2026

Rukmini Vasanth | ఎల్లో డ్రెస్‌లో డ్రాగన్ హీరోయిన్ హాట్ ఫోజులు
అక్టోబర్ 4, 2026
తాజావార్తలు
- ●GST 2.0 Reforms | జీఎస్టీ 2.0 : ఏడాదికి ఒక్కసారే పన్నుల మార్పు.. వ్యాపారులకు ఇక మరింత ఊరట
- ●DMK | రాహుల్ జీ.. తమిళనాడులో ఓట్ల తొలగింపుపై మీ వైఖరేంటి..? : డీఎంకే
- ●Facebook | ఫేస్బుక్లో భారీ మార్పు.. ఇక ఓపెన్ చేస్తే రీల్సే..
- ●Sumithranand | నిజమేదో అబద్దమేదో రేవంతే మీడియా ముందు చెప్పాలి
- ●Union Cabinet | రవాణా రంగానికి ‘ఇంటిగ్రేటెడ్’ బూస్ట్
- ●Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం రిలీజ్లో కొత్త ట్విస్ట్ - రష్మిక మందన్నతో పోటీ!

GST 2.0 Reforms | జీఎస్టీ 2.0 : ఏడాదికి ఒక్కసారే పన్నుల మార్పు.. వ్యాపారులకు ఇక మరింత ఊరట

DMK | రాహుల్ జీ.. తమిళనాడులో ఓట్ల తొలగింపుపై మీ వైఖరేంటి..? : డీఎంకే

Facebook | ఫేస్బుక్లో భారీ మార్పు.. ఇక ఓపెన్ చేస్తే రీల్సే..

Sumithranand | నిజమేదో అబద్దమేదో రేవంతే మీడియా ముందు చెప్పాలి



