Sridevi | కోర్ట్ హీరోయిన్ కొత్త మూవీ – ఉమెన్న్ కాలేజీలో యువకుడికి అడ్మిషన్ దొరికితే!
కోర్ట్ ఫేమ్ శ్రీదేవి కొత్త మూవీ హైకూ ట్రైలర్ రిలీజైంది. అమ్మాయిల కాలేజీలో చేరిన ఓ అబ్బాయి కథతో ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఏగన్ హీరోగా నటిస్తోన్నాడు.
Entertainment | Published On Oct 6, 2026, 8.36 pm IST
Sridevi | హీరో నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్ట్ మూవీతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రీదేవి. తొలి సినిమాలోనే సహజ నటనతో ఆకట్టుకుంది. తాజాగా ఈ అచ్చ తెలుగు బ్యూటీ ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.హైకూ పేరుతో రూపొందిన ఈ సినిమాలో ఏగన్ హీరోగా నటించాడు. శ్రీదేవితో పాటు ఫెమినా జార్జ్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. యువరాజ్ చిన్నస్వామి దర్శకత్వం వహిస్తున్న అక్టోబర్ 23న థియేటర్లలోకి రాబోతుంది. తాజాగా హైకూ మూవీ ట్రైలర్ రిలీజైంది. కామెడీ, లవ్, ఎమోషన్స్, బ్రేకప్ స్టోరీతో ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది.
ఉమెన్స్ కాలేజీ..
మనోహర్ అనే యువకుడికి కాలేజీలో ఆడ్మిషన్ దొరుకుతుంది. కాలేజీలో చేరిన తర్వాత అది ఉమెన్స్ కాలేజీ అని బయటపడుతుంది. ఆ కాలేజీ మొత్తానికి అతడొక్కడే అబ్బాయి...కాలేజీ వదిలిపెట్టాలని అనుకొనే టైమ్‌లోని అతడికి ఓ అమ్మాయి పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె కాకుండా మనోహర్ లైఫ్‌లో మరో అమ్మాయి కూడా ఉందనే నిజాన్ని రివీల్ చేశారు. ఈ రెండు ప్రేమకథల్లోని సంఘర్షణను ఎమోషనల్‌గా ఆవిష్కరించారు. ట్రైలర్ చివరలో ‘ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నప్పుడు.. బాగా చూసుకోవాలి.. వన్స్ తను వదిలేసి వెళ్లిపోవాలని డిసైడ్ అయితే కాళ్లు పట్టుకుని బతిమిలాడినా ఉపయోగం ఉండదు’ డైలాగ్ హైకూ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. ట్రైలర్‌లోని బీజీఎమ్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.
నెట్‌ఫ్లిక్స్...
హైకూ ట్రైలర్‌లో శ్రీదేవి కాలేజీ స్టూడెంట్‌గా నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది. ఎగన్, శ్రీదేవి కెమిస్ట్రీ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. హైకూ షూటింగ్ పూర్తికాకముందే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ‘హైకూ’ సినిమాకి ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రాఫర్‌గా, సిద్ధు కుమార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | అమ్మానాన్నల పెళ్లి స్వర్గంలోనే.. జాన్వీ చిన్ననాటి కామెంట్స్ వైరల్..
ఆగస్టు 22, 2026

Malayalam OTT | ట్విస్ట్‌లతో వణికించే మలయాళం హారర్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది – ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్
జూన్ 29, 2026

OTT | 44 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి కమల్‌హాసన్, శ్రీదేవి బ్లాక్‌బస్టర్ మూవీ
ఏప్రిల్ 30, 2026
తాజావార్తలు
- ●PM Narendra Modi 25 Years | సీఎంగా మొదలై పీఎంగా విశ్వవేదికపైకి.. పాలనాధినేతగా మోదీ 25 ఏళ్ల ప్రభంజనం: కేంద్ర మంత్రివర్గం చారిత్రక తీర్మానం
- ●BitChat | బ్లూటూత్ మెసేజింగ్ యాప్ బిట్‌చాట్‌పై కేంద్రం చర్యలు.. ప్లే స్టోర్ నుంచి అవుట్..!
- ●DRDO | ఆత్మనిర్భర్ భారత్‌లో ముందడుగు.. డీఆర్డీవో హై-ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫామ్ సిస్టమ్ సక్సెస్..!
- ●Jason Sanjay | నేను లవ్ ఫెయిల్యూర్నే - బ్రేకప్‌పై దళపతి విజయ్ కొడుకు కామెంట్స్
- ●ACB Raids Telangana | కోరుట్ల ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ మెరుపు దాడి: ఎంవీఐ బదులు కానిస్టేబులే డ్రైవింగ్ టెస్టులు
- ●Sourav Ganguly | ఇకనైనా తలరాత మారేనా..? ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా సౌరవ్ గంగూలీ

PM Narendra Modi 25 Years | సీఎంగా మొదలై పీఎంగా విశ్వవేదికపైకి.. పాలనాధినేతగా మోదీ 25 ఏళ్ల ప్రభంజనం: కేంద్ర మంత్రివర్గం చారిత్రక తీర్మానం

BitChat | బ్లూటూత్ మెసేజింగ్ యాప్ బిట్‌చాట్‌పై కేంద్రం చర్యలు.. ప్లే స్టోర్ నుంచి అవుట్..!

DRDO | ఆత్మనిర్భర్ భారత్‌లో ముందడుగు.. డీఆర్డీవో హై-ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫామ్ సిస్టమ్ సక్సెస్..!

Jason Sanjay | నేను లవ్ ఫెయిల్యూర్నే - బ్రేకప్‌పై దళపతి విజయ్ కొడుకు కామెంట్స్



