Sridevi | శ్రీదేవి కోసం చూడాల్సిన సినిమా – “హైకూ”పై కోన వెంకట్ కామెంట్స్
"హైకూ" ప్రతి ఒక్కరికి తమ కాలేజీ రోజుల నాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సినిమా అని రైటర్ కోన వెంకట్ అన్నారు. శ్రీదేవి కోసమైనా ఈ సినిమా చూడాలని అన్నారు. ఏగన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీతోనే శ్రీదేవి కోలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది. తమిళంతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 23న ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
Entertainment | Published On Oct 18, 2026, 5.21 pm IST
Sridevi | కోర్ట్ మూవీ ఫేమ్ శ్రీదేవి "హైకూ" సినిమాతో హీరోయిన్గా తమిళ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఏగన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా అదే పేరుతో తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో శ్రీదేవితో పాటు ఫెమినా జార్జ్ మరో హీరోయిన్గా నటించింది. యువరాజ్ చిన్నసామి కథను అందిస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అక్టోబర్ 23న హైకూ థియేటర్లలోకి రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో ఓ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రచయిత, నిర్మాత కోన వెంకట్, కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీశ్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
మనసుకు నచ్చిన కథ
హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. ‘‘ నా మనసుకు బాగా నచ్చిన కథ ఇది. లవ్, లేషన్ షిప్ లోఉన్న వారితో పాటు , పెళ్లైన వారికి కనెక్ట్ అవుతుంది. ప్రేమలో కాంప్లికేషన్స్ మొత్తం ఈ సినిమాలో చూస్తారు. షూటింగ్లో నా కాలేజీ నాటి రోజులు గుర్తొచ్చాయి. ఏగన్తో నా కాంబినేషన్లో వచ్చే సీన్లు నవ్విస్తూనే ఎమోషనల్‌కు గురిచేస్తాయి. తమిళంలో ఇదే నా డెబ్యూ మూవీ. మంచి సినిమాతో కోలీవుడ్లోకి అడుగుపెట్టనుండటం ఆనందంగా ఉంది" అని చెప్పింది.
ఇష్టపడి.. కష్టపడి....
ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా ఇదని, యూత్‌తో పాటు అన్ని వర్గాల ఆడియెన్స్‌ను మెప్పిస్తుందని హీరో ఏగన్ అన్నారు. కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీశ్ మాట్లాడుతూ.. ‘‘ శ్రీదేవి ప్రతిభావంతురాలైన నటి. కళ్ళతో ఏ భాష అయినా మాట్లాడగలడు. హైకూ కోసం ఆమె చాలా కష్టపడింది. కోర్ట్ తర్వాత ఆమె కెరీర్లో మరో బెస్ట్ మూవీగా హైకూ నిలుస్తుందనే నమ్మకముంది" అని పేర్కొన్నారు.
ఓటీటీకి అమ్మేసి...
కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘‘హైకూ ఓటీటీ హక్కులను అమ్మేసి ఆ తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం కథపై మేకర్స్‌కు ఉన్న నమ్మకానికి నిదర్శనం. నెట్ ఫ్లిక్స్ వారికీ స్టోరీ చెప్పి హైకూ తీశారంటే వాళ్ళని ఈ కథ ఎంత మెప్పించిందో అర్థమవుతుంది. సిన్సియర్ లవ్ స్టోరీ ఇది. . ప్రతి ఒక్కరికి తమ కాలేజీ లైఫ్‌లోని జ్ఞాపకాలను గుర్తుకుతెస్తుంది. సినిమా చూస్తున్న అందరిని కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా అవుతుంది. స్పెషల్ గా ఈ సినిమాను శ్రీదేవి కోసం చూడాలి" అని అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jyoti Poorvaj | హీరోయిన్గా గుప్పెడంత మనసు సీరియల్ నటి – భర్తతో కలిసి సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ
అక్టోబర్ 18, 2026

Prabhas Spirit | అఫీషియల్ : ప్రభాస్ స్పిరిట్ వాయిదా – ఫౌజీ కోసమేనా?
అక్టోబర్ 18, 2026

Nayanthara | ఐదోసారి జోడీ కుదిరిందా? – ధర్మన్‌లో సూపర్ స్టార్ వర్సెస్ లేడీ సూపర్‌స్టార్
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●Pakistan Airspace Ban India | భారత్‌పై పాకిస్తాన్ మరోసారి అక్కసు: భారత విమానాలపై గగనతల నిషేధం పొడిగింపు
- ●Gurrala Nagaraju | ఆధారాలుంటే బయటపెట్టండి… కేసీఆర్‌పై బురదజల్లడం ఆపండి!
- ●Navaratri Brahmotsavam | తిరుమల శ్రీవారి ఆలయంలో పద్మావతి అమ్మవారు ఎందుకు కనిపించరు?
- ●Meta AI | ఆ వివాదంలో మెటా యూటర్న్.. వెబ్సైట్ల కంటెంట్‌పై కీలక వివరణ!
- ●Brother and Sister Die in Road Accident | దసరాకు చెల్లిని పుట్టింటికి తీసుకొస్తుండగా ప్రమాదం.. అన్నాచెల్లెళ్లు స్పాట్ డెడ్
- ●London Parliament Square Protest | లండన్‌లో హైడ్రామా: సీఈసీకి వ్యతిరేకంగా ధ్రువ్ రాఠీ స్పీచ్.. పోటీగా 'మోదీ.. మోదీ' నినాదాలు!

Pakistan Airspace Ban India | భారత్‌పై పాకిస్తాన్ మరోసారి అక్కసు: భారత విమానాలపై గగనతల నిషేధం పొడిగింపు

Gurrala Nagaraju | ఆధారాలుంటే బయటపెట్టండి… కేసీఆర్‌పై బురదజల్లడం ఆపండి!

Navaratri Brahmotsavam | తిరుమల శ్రీవారి ఆలయంలో పద్మావతి అమ్మవారు ఎందుకు కనిపించరు?

Meta AI | ఆ వివాదంలో మెటా యూటర్న్.. వెబ్సైట్ల కంటెంట్‌పై కీలక వివరణ!



