త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఎండిన పంట‌ల‌ను ప‌రిశీలిస్తూ.. అండ‌గా ఉంటామ‌ని భ‌రోసానిస్తూ

Harish Rao | వ‌న‌ప‌ర్తి (Wanaparthy) జిల్లాలో సోమ‌వారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు (Harish Rao) విస్తృతంగా ప‌ర్య‌టించారు.

S

Telangana | Published On Nov 2, 2026, 6.27 pm IST

Harish Rao | ఎండిన పంట‌ల‌ను ప‌రిశీలిస్తూ.. అండ‌గా ఉంటామ‌ని భ‌రోసానిస్తూ
Advertisement
  • వ‌న‌ప‌ర్తి జిల్లాలో ప‌ర్య‌టించిన మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

Harish Rao | త్రినేత్ర న్యూస్‌: వ‌న‌ప‌ర్తి (Wanaparthy) జిల్లాలో సోమ‌వారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు (Harish Rao) విస్తృతంగా ప‌ర్య‌టించారు. పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో ఎండిపోయిన వరి పంట పొలాలను మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి, వీ శ్రీ‌నివాస్‌గౌడ్‌తో కలిసి ఆయ‌న‌ పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా సాగు నీరు అందక కళ్లముందే ఎండిపోయిన వరి పైరును హరీశ్ రావుకు చూపిస్తూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

చేతికొచ్చే దశలో పంట పూర్తిగా ఎండిపోయి పెట్టుబడి కూడా దక్కక అప్పుల పాలయ్యామని కన్నీటిపర్యంత‌మ‌య్యారు. రైతన్నల కష్టాలను అడిగి తెలుసుకుని, ఎండిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హ‌రీశ్‌రావు భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్:

Field VisitHarish RaoNiranjan ReddyPaddy CropsSrinivas GoudTelanganaWanaparthy
Advertisement
Advertisement