Sreeleela | క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్.. స్పందించిన హీరోయిన్ తల్లి..
Sreeleela | ధమాకా బ్యూటీ శ్రీలీల (Sreeleela) సినిమాలతో కంటే డేటింగ్ రూమర్లతో వార్తల్లో నిలుస్తున్నది. గతంలో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో (Karthik Arryan) పెండ్లి పీటలు ఎక్కబోతున్నది అంటూ పుకార్లు షికార్లు చేశాయి.
Sreeleela | త్రినేత్ర.న్యూస్: ధమాకా బ్యూటీ శ్రీలీల (Sreeleela) సినిమాలతో కంటే డేటింగ్ రూమర్లతో వార్తల్లో నిలుస్తున్నది. గతంలో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో (Karthik Arryan) పెండ్లి పీటలు ఎక్కబోతున్నది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ క్రికెటర్ తిలక్ వర్మతో (Tilak Varma) చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నదని, ఇరువురు గతేడాదిగా డేటింగ్ ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. గత డిసెంబర్‌లో శ్రీలీల తన తల్లితో కలిసి తిరుమలను దర్శించుకున్నది. అదే రోజు సేమ్ టైమ్‌లో తిలక్ వర్మ కూడా తిరుమలలో కనిపించారు. వీరిద్దరు తిరుమల రావడం కాకతాళీయం అని ఫ్యాన్స్‌ను భావించారు. కానీ జంటగానే దేవుడి దర్శనం చేసుకున్నట్లు బయటపడింది. తాజాగా ముంబై ఐపీఎల్ మ్యాచ్‌కు శ్రీలీల హాజరు కావడంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. గతేడాదిగా వీరిపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
కాగా, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత కొట్టిపారేశారు. అవన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేశారు. అసలు ఇప్పటి వరకు శ్రీలీల- తిలక్ వర్మ ఒక్క సారి కూడా కలుసుకోలేదని చెప్పారు. 2025 డిసెంబర్‌లో శ్రీలీల-తిలక్ ఇద్దరూ తిరుమలను సందర్శించడం.. అలాగే వాంఖడే టీ20 మ్యాచ్‌లో నటి సందడి చేయడం.. ఇవి రెండూ ఉద్దేశపూర్వకంగా జరగలేదని ఆమె అన్నారు. గతంలో కార్తీక్ ఆర్యన్‌తో వచ్చిన డేటింగ్ వార్తలను సైతం కొట్టిపారేశారు. కార్తీక్ వాళ్ల మదర్ డాక్టర్ కావడంతోనే వృత్తిపరంగా కలిశామని క్లారిటీ ఇచ్చారు. దీంతో హీరోయిన్‌పై డేటింగ్ రూమర్స్‌కు చెక్ పడినట్లయింది.
పెళ్లిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలల.. రవితేజ ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకుంది. బాలయ్య భగవంత్ కేసరి సినిమా సోసో అనిపించుకున్నా.. నటనపరంగా మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం కోలీవుడ్ హీరో ధనుశ్‌తో ఓ సినిమా చేస్తున్నది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






