త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BCCI | శ్రీ‌లంక వేదిక‌గా ట్రై సిరీస్‌.. ఇండియా ఏ జ‌ట్టులోకి వైభ‌వ్ సూర్య‌వంశీ..!

BCCI | శ్రీ‌లంక వేదిక‌గా జ‌రుగ‌నున్న ట్రై సిరీస్ కోసం బీసీసీఐ గురువారం ఇండియా-ఏ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ సిరీస్‌లో ఇండియా-ఏతో పాటు శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్లు పాల్గొనున్నాయి. ఈ జట్టులో 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి చోటు ద‌క్కింది.

P

Sports | Published On May 14, 2026, 5.02 pm IST

BCCI | శ్రీ‌లంక వేదిక‌గా ట్రై సిరీస్‌.. ఇండియా ఏ జ‌ట్టులోకి వైభ‌వ్ సూర్య‌వంశీ..!
Advertisement

BCCI | శ్రీ‌లంక వేదిక‌గా జ‌రుగ‌నున్న ట్రై సిరీస్ కోసం బీసీసీఐ గురువారం ఇండియా-ఏ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ సిరీస్‌లో ఇండియా-ఏతో పాటు శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్లు పాల్గొనున్నాయి. ఈ జట్టులో 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి చోటు ద‌క్కింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న వైభ‌వ్‌కు అవ‌కాశం క‌ల్పించింది. చిన్న వయసులోనే అగ్ర‌శ్రేణి బౌల‌ర్లను త‌న బ్యాట్‌తో వ‌ణికిస్తూ క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాడు. ట్రై సిరీస్ ముగిసిన తర్వాత ఇండియా-ఏ జట్టు శ్రీలంక-ఏతో రెండు మల్టీడే మ్యాచ్‌లు సైతం ఆడనుంది. ఆ సిరీస్‌కు సంబంధించిన జట్టును బీసీసీఐ త‌ర్వాత ప్ర‌క‌టించ‌నుంది. ట్రై సిరీస్ మ్యాచులు దంబుల్లా వేదిక‌గా, మ‌ల్టీడే మ్యాచులు గాలేలో జ‌రుగ‌నున్నాయి.

వైభవ్ సూర్యవంశీపైనే అంద‌రి దృష్టి

ఇండియా-ఏ జ‌ట్టులో వైభ‌వం చోటు ద‌క్కించుకోవ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌ఫున 11 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ 440 పరుగులు చేశాడు. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అజేయ సెంచ‌రీ చేయ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకుంటున్న యువ ఆట‌గాడు శ్రీ‌లంక‌, ఆఫ్ఘ‌నిస్తాన్ బౌల‌ర్ల‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారే అవ‌కాశం ఉంది. ఇండియా-ఏ విజ‌యంలో కీల‌క పాత్ర పోషిస్తాడ‌ని క్రికెట్ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

ట్రై సిరీస్‌కు ఇండియా-ఏ జట్టు

తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), అయుష్ బదోనీ, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షాద్ ఖాన్.

Advertisement
Advertisement