త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sobhita Dhulipala | పెళ్లి త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్‌ – డైరెక్ట్‌గా ఓటీటీలోకి శోభిత ధూళిపాళ్ల తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ

పెళ్లి త‌ర్వాత సినిమాలకు ఏడాది పాటు గ్యాప్ ఇచ్చిన శోభిత ధూళిపాళ్ల మ‌ళ్లీ ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. చీక‌టిలో పేరుతో రూపొందిన ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. జ‌న‌వ‌రి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Jan 8, 2026, 2.46 pm IST

Sobhita Dhulipala | పెళ్లి త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్‌ – డైరెక్ట్‌గా ఓటీటీలోకి శోభిత ధూళిపాళ్ల తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ
Advertisement

Sobhita Dhulipala |  నాగ‌చైత‌న్య‌తో పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు స్మాల్ గ్యాప్ ఇచ్చిన శోభిత ధూళిపాళ్ల మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీతో రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. అయితే శోభిత కొత్త మూవీ థియేట‌ర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు స్ట్రీమింగ్ డేట్ గురువారం క‌న్ఫామ్ అయ్యాయి. శోభిత ధూలిపాళ్ల హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు చీక‌టిలో అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. జ‌న‌వ‌రి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కాబోతున్న‌ట్లు అమెజాన్ ప్రైమ్ ప్ర‌క‌టించింది.

సీరియ‌స్ లుక్‌లో...

చీక‌టిలో మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో చెవుల‌కు హెడ్‌ఫోన్స్ పెట్టుకొని మైక్ ముందు కూర్చొని సీరియ‌స్ లుక్‌లో శోభిత క‌నిపిస్తోంది. ఆమె వెనుక పుర్రె బొమ్మ ఆకారం, క్రైమ్ వార్త‌ల‌కు సంబంధించిన పేప‌ర్ క్లిప్స్ క‌నిపిస్తున్నాయి. చీక‌టిలో మూవీలో శోభిత ధూళిపాళ్ల‌తో పాటు విశ్వ‌దేవ్ రాచ‌కొండ‌, చైత‌న్య‌కృష్ణ‌, ఇషా చావ్లా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన ఈ మూవీకి శ‌ర‌ణ్ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. సైలెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసిన మేక‌ర్స్ గురువారం రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు.

నాలుగేళ్ల త‌ర్వాత‌...

మేజ‌ర్ త‌ర్వాత తెలుగులో సినిమా చేయ‌లేదు శోభిత‌. దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత చీక‌టిలో మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌ర‌కు తెలుగులో చేసిన క్యారెక్ట‌ర్ల‌కు భిన్నంగా చీక‌టిలో మూవీలో ఓ ఛాలెంజింగ్ రోల్‌లో శోభిత క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.
ప్ర‌స్తుతం చీక‌టిలో పాటు త‌మిళంలో వెట్టువమ్ అనే సినిమా కూడా చేస్తోంది శోభిత ధూళిపాళ్ల‌. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ కోలీవుడ్ మూఈలో ఆర్య హీరోగా న‌టిస్తున్నాడు. ఈ ఏడాది ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. నాగ‌చైత‌న్య‌తో శోభిత పెళ్లి 2024 డిసెంబ‌ర్‌లో జ‌రిగింది. పెళ్లికి ముందు ఈ జంట రెండేళ్ల పాటు ప్రేమ‌లో ఉన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement