త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Defamation on Maheshkumar, Addhanki Dayakar | టీపీసీసీ చీఫ్‌, అద్దంకిపై ప‌రువు న‌ష్టం దావా వేసిన హ‌రీశ్ రావు

Defamation on Maheshkumar, Addhanki Dayakar | టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌, ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్‌పై మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్‌రావు ప‌రువు న‌ష్టం దావా వేశారు.

S

Telangana | Published On Sep 17, 2026, 3.28 pm IST

Defamation on Maheshkumar, Addhanki Dayakar | టీపీసీసీ చీఫ్‌, అద్దంకిపై ప‌రువు న‌ష్టం దావా వేసిన హ‌రీశ్ రావు
Advertisement

Defamation on Maheshkumar, Addhanki Dayakar | త్రినేత్ర‌.న్యూస్‌: టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌, ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్‌పై మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్‌రావు ప‌రువు న‌ష్టం దావా వేశారు. క్షుద్ర పూజల ఆరోపణల నేపథ్యంలో ఈమేర‌కు హ‌రీశ్‌రావు తరుఫు న్యాయవాది నాంపల్లి కోర్టులో గురువారం కేసు వేశారు. క్షమాపణలు చెప్పాలని ఇప్పటికే లీగల్ నోటీసులు పంప‌గా గ‌డువు దాట‌డంతో కేసు వేసిన‌ట్లు హ‌రీశ్‌రావు త‌ర‌ఫు న్యాయ‌వాది తెలిపారు. తన రాజకీయ ప్రతిష్టను, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేశారని ఇప్పటికే హరీష్ రావు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన విష‌యం విదిత‌మే.

నాంపల్లి కోర్టు వద్ద న్యాయవాదులు మాట్లాడారు. హరీశ్ రావు గారిపై క్షుద్ర పూజలు చేశారంటూ నిరాధార ఆరోపణలు చేశారు. ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. ఒకటి అద్దంకి దయాకర్‌పై, మరొకటి మహేష్ కుమార్ గౌడ్‌పై దాఖలు చేశాం. ఉద్దేశపూర్వకంగా హరీశ్ రావు ఇమేజ్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు మేం భావిస్తున్నాం. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేశాం. అందుకు తగినంత సమయం కూడా ఇచ్చాం.

రిప్లైలో కూడా సారీ చెప్ప‌లే..

అయినప్పటికీ వారు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. వారు ఇచ్చిన రిప్లైలో కూడా క్షమాపణలు చెప్పలేదు. దేవాలయాలకు వెళ్లి పూజలు చేయడం ప్రతి హిందువుకు ఉన్న హక్కు. పవిత్రమైన దేవాలయాలకు వెళ్లి పూజలు చేసినంత మాత్రాన క్షుద్ర పూజలు చేశారని ఆరోపణలు చేయడం సరికాదు. హరీశ్ రావు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాం.

తప్పు రుజువైతే రెండేండ్ల జైలు..

సెక్షన్ 356 నిబంధనల ప్రకారం రెండు ప్రైవేట్ కంప్లైంట్లు దాఖలు చేశాం. ఇది క్రిమినల్ కేసు. తప్పు రుజువు అయితే రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఆరోపణలకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలను కోర్టుకు సమర్పించాం. ఆధారాల ఆధారంగా న్యాయస్థానం తగిన నిర్ణయం తీసుకుంటుందని, కేసు ఎస్టాబ్లిష్ అవుతుంది అని ఆశిస్తున్నాం. తప్పుడు ఆరోపణలు చేసినందుకు నిందితులకు తగిన శిక్ష పడుతుంది అని ఆశిస్తున్నాం. హరీశ్ రావు గారు ఎంతో హుందాగా రాజకీయాలు చేస్తున్నారు. సమాజంలో ఆయనకు ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదు.

Advertisement
Advertisement