త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tata Sons | టాటా స‌న్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్‌గా ఎన్ చంద్ర‌శేఖ‌ర‌న్

Tata Sons | టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ మరోసారి నియమితులయ్యారు. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు టాటా సన్స్ బోర్డు నిర్ణయించింది. గత నెలలో మరోసారి చైర్మన్‌గా కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదని చంద్రశేఖరన్ ప్రకటించిన నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

P

Business | Published On Sep 17, 2026, 3.29 pm IST

Tata Sons | టాటా స‌న్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్‌గా ఎన్ చంద్ర‌శేఖ‌ర‌న్
Advertisement

Tata Sons | టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ మరోసారి నియమితులయ్యారు. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు టాటా సన్స్ బోర్డు నిర్ణయించింది. గత నెలలో మరోసారి చైర్మన్‌గా కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదని చంద్రశేఖరన్ ప్రకటించిన నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. టాటా సన్స్‌ను లిస్టింగ్ చేయాల్సిన నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న సంస్థ అభ్యర్థనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తిరస్కరించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.

అయితే, చంద్రశేఖరన్ తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారన్నది స్పష్టంగా తెలియరాలేదు. ప్రస్తుతం చంద్రశేఖరన్ పదవీకాలం 2027 ఫిబ్రవరితో ముగియనుంది. 2017లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయనను 2022లో రెండోసారి ఐదేళ్ల కాలానికి తిరిగి నియమించారు. ఇదిలా ఉండగా.. టాటా సన్స్‌లో 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్టులతో సంస్థ వ్యూహం, పాలన అంశాలపై కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గత నెలలో చంద్రశేఖరన్ మరోసారి చైర్మన్‌గా కొనసాగబోనని ప్రకటించినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement