త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sri Meenakshi Sundareshwarar Temple | 17 ఏళ్ల తర్వాత అట్టహాసంగా మధురై మీనాక్షి ఆలయ మహా కుంభాభిషేకం.. భక్తకోటితో కిటకిటలాడిన ప్రాంగణం

ప్రసిద్ధ మధురై మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయంలో వైభవంగా మహా కుంభాభిషేకం జరిగింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ అరుదైన వేడుకను చూసేందుకు భక్తులు పోటెత్తారు.

J

Devotional | Published On Sep 17, 2026, 3.49 pm IST

Sri Meenakshi Sundareshwarar Temple | 17 ఏళ్ల తర్వాత అట్టహాసంగా మధురై మీనాక్షి ఆలయ మహా కుంభాభిషేకం.. భక్తకోటితో కిటకిటలాడిన ప్రాంగణం

సంక్షిప్త సారాంశం

మధురై శ్రీ మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయ మహా కుంభాభిషేకం గురువారం వైదిక మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. దాదాపు 17 ఏళ్ల విరామం తర్వాత ఈ కుంభాభిషేకం నిర్వహించడంతో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ వేడుక కోసం తమిళనాడు హిందూ ధార్మిక దేవాదాయ శాఖ రూ. 32.29 కోట్ల వ్యయంతో 186 రకాల పునరుద్ధరణ పనులను చేపట్టింది. భక్తుల సౌలభ్యం కోసం నగరంలో 53 చోట్ల పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో పాటు గర్భగుడి దర్శనాన్ని ఉదయం 10 గంటల తర్వాత అనుమతించారు.

Advertisement

Sri Meenakshi Sundareshwarar Temple | త్రినేత్ర.న్యూస్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మధురై శ్రీ మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయంలో మహా కుంభాభిషేకం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ, భక్తుల దివ్యనామ స్మరణల మధ్య ఈ మహా ఘట్టం కన్నులపండువగా సాగింది. దాదాపు 17 ఏళ్ల విరామం తర్వాత ఈ కుంభాభిషేకం జరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Madurai Meenakshi Temple Maha Kumbabhishekam Held After 17 Years

వైభవంగా పూజా కార్యక్రమాలు

ఆలయ ప్రధాన పురోహితులు ఉదయం 7.45 నుంచి 8.10 గంటల మధ్య శుభ ముహూర్తాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీనాక్షి అమ్మన్ ఆలయ విమానంతో పాటు సుందరేశ్వరర్ స్వామి వారి విమానాలపై పవిత్ర జలాలతో అభిషేకం జరిపించారు. దీనిని తిలకించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం మహా దీపారాధన నిర్వహించి.. భక్తులపైకి పవిత్ర జలాలు ప్రోక్షించారు. సెప్టెంబర్ 11 నుంచి ప్రారంభమైన యాగశాల పూజలు సెప్టెంబర్ 16 వరకు కొనసాగాయి.

Madurai Meenakshi Temple Maha Kumbabhishekam Held After 17 Years

రూ.32 కోట్లతో అద్భుతమైన పునరుద్ధరణ

ఈ మహా కుంభాభిషేక వేడుకను పురస్కరించుకుని తమిళనాడు హిందూ ధార్మిక దేవాదాయ శాఖ సుమారు రూ. 32.29 కోట్ల భారీ బడ్జెట్‌తో 186 రకాల ప్రత్యేక పునరుద్ధరణ పనులను పూర్తి చేసింది. ఆర్కియాలజీ నిపుణుల పర్యవేక్షణలో 14 అద్భుతమైన గోపురాలను పూర్తిగా శుభ్రపరిచి, రంగులు వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

Madurai Meenakshi Temple Maha Kumbabhishekam Held After 17 Years

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

భక్తుల రద్దడిని దృష్టిలో ఉంచుకుని మధురై నగర వ్యాప్తంగా 53 ప్రాంతాల్లో పెద్ద ఎల్ఈడీ (LED) స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల తర్వాతే గర్భగుడిలోకి దర్శనానికి అనుమతించడంతో నాలుగు చిత్రై వీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భద్రతా చర్యల నిమిత్తం పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి తగిన చర్యలు చేపట్టారు.

Madurai Meenakshi Temple Maha Kumbabhishekam Held After 17 Years

Advertisement
Advertisement