Cheekatilo Review | చీకటిలో రివ్యూ – శోభిత ధూళిపాళ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
శోభిత ధూళిపాళ నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ చీకటిలో శుక్రవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడు.
Entertainment | Published On Jan 23, 2026, 9.54 am IST
Cheekatilo Review | అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ చీకటిలో(Cheekatilo Movie ). క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. చైతన్య కృష్ణ, ఆమని, ఇషా చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో (Amazon Prime Ott) రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
సంధ్య ఇన్వేస్టిగేషన్
సంధ్య ( శోభిత ధూళిపాళ) ఓ జర్నలిస్ట్. న్యూస్ ఛానెల్‌లో క్రైమ్ షో చేస్తుంటుంది. నేరాల వెనుక ఉన్న కారణాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావాలని తపన పడుతుంటుంది కానీ టీఆర్‌పీల కోసం సంధ్య రాసిన స్క్రిప్ట్‌లో ఛానెల్ మేనేజ్‌మెంట్ చాలా మార్పులు చేస్తుంటారు. క్రైమ్ షోను బూతు షోగా మార్చేస్తారు. వారి తీరు నచ్చక జాబ్ మానేస్తుంది. స్నేహితురాలు బాబీ (అదితి) ఇచ్చిన సలహాతో సొంతంగా పాడ్‌కాస్ట్ ప్రారంభిస్తుంది సంధ్య. అనూహ్యంగా బాబీ దారుణంగా హత్యకు గురవుతుంది. స్నేహితురాలి హత్య వెనుక ఉన్న కారణాలను తెలుసుకునే క్రమంలో కిల్లర్ గురించి సంధ్యకు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. బాబీ తరహాలోనే కొన్నేళ్లుగా ఆ కిల్లర్ ఎంతో మంది మహిళలను చంపేశాడనే నిజం బయటపడుతుంది. మహిళలను హత్య చేసి వారి జడలో మల్లెపూలు పెట్టి మాయం అవుతుంటాడు. ఆ సీరియల్ కిల్లర్ గురించి సంధ్య చేసిన పాడ్‌కాస్ట్ ఫేమస్ అవుతుంది. మరోవైపు ఆ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్లు ఆనందిత (ఇషా చావ్లా), రాజీవ్ (చైతన్య కృష్ణ) ప్రయత్నాలు చేస్తుంటారు. వారి ఇన్వేస్టిగేషన్‌కు సంధ్య ఎలాంటి సాయం చేసింది? ఆ కిల్లర్‌ను సంధ్య పట్టుకుందా? సంధ్య పెళ్లి చేసుకోబోయే అమర్ కు (విశ్వదేవ్ రాచకొండ) ఆ కిల్లర్‌తో ఉన్న సంబంధం ఏమిటి? అతడు ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు? అన్నదే చీకటిలో మూవీ కథ.
క్రైమ్ థ్రిల్లర్...
ఓటీటీలో లవ్‌స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాల కంటే క్రైమ్ థ్రిల్లర్స్ , మర్డర్ మిస్టరీ సినిమాలకే ఎక్కువగా ఆదరణ ఉంటోంది. డైరెక్ట్ ఓటీటీ సినిమాల అనగానే చాలా మంది దర్శకులు క్రైమ్ థ్రిల్లర్ కథలనే ఎంచుకుంటున్నారు. చీకటిలోతో దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఈ బాటలోనే అడుగులు వేశారు. ఓ సీరియల్ కిల్లర్ కథతో ఈ సినిమా చేశారు.
క్లైమాక్స్ సర్‌ప్రైజ్..
సాధారణంగా ఈ సీరియల్ కిల్లర్ కథలు ఒకే రీతిలో సాగుతుంటాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా హత్యలు చేసే కిల్లర్...అతడిని పట్టుకోవడానికి హీరోనో...లేదో హీరోయిన్ వేసే ఎత్తులు...ఆ కిల్లర్‌కు ఓ ఫ్లాష్‌బ్యాక్...ఇదే ఫార్మెట్‌లో ఈ కథలు ఉంటాయి. చీకటిలో కూడా అలాంటి రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే అనుకునే ఆడియెన్స్‌కు క్లైమాక్స్‌లో సర్‌ప్రైజ్ ఇచ్చాడు డైరెక్టర్.
లైంగిక వేధింపుల వెనుక ఉన్న మరో యాంగిల్‌ను ఈ సినిమాలో చూపించాడు. మహిళలు వేసే తప్పటడుగులు అమాయకులను హంతకులుగా ఎలా మార్చుతాయి? కొన్ని బంధాలకు ఎలా మచ్చలు తీసుకొస్తాయన్నది ఇంట్రెస్టింగ్‌గా చూపించాడు. సొసైటీలో రియల్‌గా జరుగుతోన్న కొన్ని క్రైమ్ నుంచే దర్శకుడు ఇన్‌స్పైర్ అయినట్లుగా కనిపించింది.హద్దులు దాటకుండా...ఓటీటీ అంటేనే సెన్సార్ ఉండదు. బోల్డ్‌గా , వయలెంట్‌గా ఈ కథను చెప్పొచ్చు. కానీ దర్శకుడు మాత్రం ఎక్కడ హద్దులు దాటలేదు. నిజాయితీగా తాను అనుకున్న కథను పక్కదారులు పట్టకుండా చెప్పిన తీరు బాగుంది.
రన్ టైమ్ తక్కువే...
రాజచంద్రవరం అనే ఊరిలో ఓ మహిళ హత్యతో ఈ సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి సంధ్య పాత్ర పరిచయం, జాబ్ నచ్చక ఆమె పడే సంఘర్షణను చూపించారు. బాబీ హత్యకు గురవ్వడం, ఆ హత్యపై సంధ్య చేసే ఇన్వేస్టిగేషన్ నుంచే అసలు కథ మొదలవుతుంది.
ఓ వైపు పోలీస్ ఇన్వేస్టిగేషన్, మరోవైపు హంతకుడి కోసం సంధ్య అన్వేషణతో చివరి వరకు థ్రిల్లింగ్‌గా సాగుతుంది. హంతకుడు ఎవరన్నది రివీలయ్యే ట్విస్ట్ బాగుంది. ఎవరూ ఊహించని క్యారెక్టర్‌తో క్లైమాక్స్‌ను బాగా రాసుకున్నాడు డైరెక్టర్. అలాంటి ట్విస్ట్‌లు ఇంకొన్ని ఉండుంటే బాగుండేది.
కాన్సెప్ట్ కొత్తగా ఉన్న స్క్రీన్‌ప్లే మాత్రం చాలా పాతగా ఉంది. సినిమా రన్‌టైమ్ తక్కువే అయినా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. పోలీస్ ఇన్వేస్టిగేషన్ సీన్లు బోరింగ్ ఫీల్ కలిగిస్తాయి. హంతకుడిగా అనుమానిస్తూ ప్రవేశపెట్టి న చినబాబు పాత్ర వల్ల సినిమా లెంగ్త్ పెరిగింది తప్పితే ఎలాంటి ఉపయోగం కనిపించలేదు.
సెటిల్డ్ యాక్టింగ్...
సంధ్య పాత్రలో శోభిత ధూళిపాళ్ల నటన బాగుంది. గత సినిమాలకు భిన్నంగా సీరియస్ క్యారెక్టర్‌లో సెటిల్డ్ యాక్టింగ్‌ను కనబరిచింది. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన శోభిత ఇందులో మాత్రం ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది. హీరోయిన్‌కు ధీటుగా మిగిలిన క్యారెక్టర్లను బలంగా రాసుకోలేదు డైరెక్టర్. చైతన్య కృష్ణ, ఇషా ఛావ్లా, సురేష్, ఆమని...చాలా మంది యాక్టర్లు ఉన్నా ఎవరి పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు.ఎక్కువగా కామెడీ ప్రధాన పాత్రలు చేసిన శ్రీనివాస్ వడ్లమాని ఇందులో డిఫరెంట్ రోల్ చేశారు. శ్రీచరణ్ పాకాల బీజీఎమ్ కథలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది.
కొత్త కోణంలో...
చీకటిలో క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఓకే అనిపిస్తుంది. హీరోయిన్‌గా శోభితను కొత్త కోణంలో ఆవిష్కరించింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






