త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sneha Ullal | సినిమా అవకాశాలు అలా వచ్చానయడంలో వాస్తవం లేదు : స్నేహ ఉల్లాల్‌..

Sneha Ullal | సల్మాన్‌ హీరోగా నటించిన లక్కీ : నో టైమ్‌ ఫర్‌ లవ్‌ మూవీతో స్నేహ ఉల్లాల్‌ బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమెలో ఐశ్యర్యరాయ్‌ పోలికలు చూసి అంతా ఆశ్చర్యపోయారు. దాంతో అమెను జూనియర్‌ ఐశ్వర్యరాయ్‌గా పిలిచారు. అయితే, తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

P

Entertainment | Published On Mar 18, 2026, 2.30 pm IST

Sneha Ullal | సినిమా అవకాశాలు అలా వచ్చానయడంలో వాస్తవం లేదు : స్నేహ ఉల్లాల్‌..
Advertisement

Sneha Ullal | సల్మాన్‌ హీరోగా నటించిన లక్కీ : నో టైమ్‌ ఫర్‌ లవ్‌ మూవీతో స్నేహ ఉల్లాల్‌ బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమెలో ఐశ్యర్యరాయ్‌ పోలికలు చూసి అంతా ఆశ్చర్యపోయారు. దాంతో అమెను జూనియర్‌ ఐశ్వర్యరాయ్‌గా పిలిచారు. అయితే, తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ పోలికలు తనను ఎప్పుడూ ఇబ్బందిపెట్టలేదని తెలిపింది. ఈ సందర్భంగా సల్మాన్‌తో కలిసి నటించడంపై అనుభవాలను గుర్తు చేసుకుంది. షూటింగ్‌ సమయంలో సల్లూభాయ్‌ ఎంతో సహనంతో, సహాయసహకారాలు అందించేవాడని తెలిపింది. ఎప్పుడూ తాను సూపర్‌ స్టార్‌ అనే అహంకారాన్ని చూపించలేదని పేర్కొంది. తాను ఐశ్వర్య రాయ్ పోలికలు ఉండడం వల్లనే సినిమా అవకాశాలు వచ్చాయనే వార్తలను ఖండించింది. సినిమాల్లోకి వచ్చిన సమయంలో తన వయసు తక్కువేనని, ఆ సమయంలో తాను అందం గురించి ఎక్కువగా ఆలోచించేదాన్ని కాదని, అందుకే ఈ పోలికలు తనను ప్రభావితం చేయలేకపోయానని చెప్పింది. ‘ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ అయిన తర్వాత ఆమెలా కనిపిస్తున్నావంటూ పలువురు తనకు చెప్పారని, తాను ఓ సమయంలో ఆమెను కలిసినప్పుడు బాలీవుడ్‌కు స్వాగతం అంటూ చెప్పిందని తెలిపింది. అప్పట్లో మీడియాలో పోలికలకు సంబంధించిన వార్తలు వచ్చాయని.. వాటిని చూసి తనను ద్వేషించొద్దని కోరానని తెలిపింది.

2005లో విడుదలైన లక్కీ మూవీకి రాధికా రావు, విజయ్‌ సర్పు దర్శకత్వం వహించారు. యుద్ధ పరిస్థితుల్లో రష్యాలో ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి, కేదార్‌ ఖాన్‌, నవ్ని పరిహార్‌, రవి బస్వాని, విక్రమ్‌ గోఖలే తదితరులు కీలకపాత్రలో పోషించారు. రూ.14కోట్లతో బడ్జెట్‌ తెరకెక్కించిన ఈ మూవీలో ప్రపంచవ్యాప్తంగా రూ.27.81కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ తర్వాత స్నేహ ఉల్లాల్‌ హిందీతో పాటు పలు తెలుగు సినిమాల్లోనూ మెరిసింది. ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నేను మీకు తెలుసా?, మడత కాజా, కరెంట్‌, సింహా, అలా మొదలైంది, యాక్షన్‌ 3డీ మూవీల్లో నటించింది. చివరగా తెలుగులో నీలకంఠ మూవీలో నటించింది. ఈ సినిమా గతేడాది జనవరి 2న విడుదలైంది. ఇదిలా ఉండగా ఐశ్వర్యరాయ్‌ కొంతకాలంగా ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. చివరిసారిగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్‌ సెల్వన్‌ సిరీస్‌లో కనిపించింది. ఈ మూవీలో బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement