Oscar Movies OTT | ఆస్కార్‌కు నామినేట్ అయిన సినిమాలను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
2026 ఆస్కార్‌కు నామినేట్ అయిన పలు సినిమాలో ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. 16 నామినేషన్లు దక్కించుకున్న సిన్నర్స్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. లియోనార్డ్ డికాప్రియో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది.
Entertainment | Published On Jan 25, 2026, 4.11 pm IST
Oscar Movies OTT | 2026 ఆస్కార్ నామినేషన్లను అకాడెమీ కమిటీ ఇటీవల ప్రకటించింది. ఇందులో హారర్ మూవీ సిన్నర్స్ పదహారు నామినేషన్లతో రికార్డును క్రియేట్ చేసింది. ఈ హారర్ మూవీ తర్వాత లియోనార్డో డికాప్రియో నటించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 14 నామినేషన్లను దక్కించుకుంది. ఈ సారి బెస్ట్ పిక్చర్ కేటగిరీలో పది సినిమాలు పోటీపడబోతున్నాయి. విజేతలు ఎవరన్నది సినీ లవర్స్‌లో ఆసక్తికరంగా మారింది.
ఆస్కార్‌కు నామినేట్ అయిన హాలీవుడ్ సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఇందులో కొన్ని మూవీస్ తెలుగు వెర్షన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. ఆస్కార్ నామినేటెడ్ సినిమాలను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
జియో హాట్‌స్టార్...
ఆస్కార్‌లో అత్యధిక నామినేషన్లను దక్కించుకున్న సిన్నర్స్ మూవీ ప్రస్తుతం జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సిన్నర్స్ మూవీ బెస్ట్ పిక్చర్, యాక్టర్, డైరెక్టర్‌తో పాటు పలు కేటగిరీల్లో పోటీపడబోతుంది. మైఖేల్ జోర్డాన్ హీరోగా నటించిన ఈ మూవీకి రయాన్ కూగ్లర్ దర్శకత్వం వహించారు. సిన్నర్స్‌తో పాటు విజువల్స్ ఎఫెక్ట్స్ కేటగిరీలో నామినేట్ అయిన జూరాసిక్ వరల్డ్ రీబర్త్ కూడా జియో హాట్‌స్టార్‌లోనే విడుదలైంది. ఆస్కార్ బరిలో నిలిచిన ఈలో, వెపన్ సినిమాలూ కూడా ఇదే ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్....
హయ్యెస్ట్ ఆస్కార్ నామినేషన్స్‌లో ఫ్రాంకిన్‌స్టన్ మూడో ప్లేస్‌లో ఉంది. ఈ సినిమా తొమ్మిది కేటగిరీల్లో అవార్డుల కోసం పోటీపడుతోంది. ఫ్రాంకిన్‌స్టన్ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. గిల్లెర్మో డెల్ టోరో దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో రిలీజైంది. బెస్ట్ పిక్చర్‌తో పాటు మరో నాలుగు విభాగాల్లో నిలిచిన ట్రైన్ డ్రీమ్స్ మూవీతో పాటు యానిమేటెడ్ మూవీ కే పాప్ డెమోన్ హంటర్స్ నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ అవుతోన్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో...
2026 ఆస్కార్స్‌లో 13 నామినేషన్లతో లియోనార్డో డికాప్రియో మూవీ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అదరగొట్టింది. ఈ సినిమా ప్రస్తుతం రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ హాలీవుడ్ అందుబాటులో ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పాల్ అండర్సన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎమ్మా స్టోన్ బగోనియా మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. బ్రాడ్ పిట్ ఎఫ్ 1 తో పాటు బ్లూ మూన్, ది స్మాషింగ్ మిషన్, ది అగ్లీ స్టెప్ సిస్టర్ సినిమాలు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే రిలీజయ్యాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






