PM Modi | విభజన శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి.. ప్రధాని మోదీ పిలుపు
PM Modi | సమాజాన్ని విభజించాలనుకునే శక్తులకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా పోరాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. పౌరులను స్వయం సమృద్ధి వైపు (self-reliance) ప్రేరేపించాలని కోరారు. అప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని అన్నారు.
PM Modi | త్రినేత్ర న్యూస్ : దేశంలో ఎదురవుతున్న కొత్త సవాళ్లను, సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు అందరూ కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. సమాజాన్ని విభజించాలనుకునే శక్తులకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. పౌరులను స్వయం సమృద్ధి (self-reliance) వైపు ప్రేరేపించాలని పేర్కొన్నారు. అప్పుడే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం (Developed India by 2047) సాధ్యమవుతుందని అన్నారు.
ఢిల్లీలోని భారత మండపంలో చిన్మయ అమృత మహోత్సవ గ్లోబల్ సమ్మేళన్ (Chinmaya Amrit Mahotsav Global Sammelan)ను ప్రధాని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. చిన్మయ మిషన్ (Chinmaya Mission) కేవలం ఒక సంస్థ కాదని, అదొక ఆలోచనా విధానమని పేర్కొన్నారు. "గడిచిన దశాబ్దాల్లో కాలం చాలా మారిపోయింది. దేశం ముందుకు అనేక కొత్త సవాళ్లు వచ్చాయి. కొత్త సామాజిక రుగ్మతలు బయటపడ్డాయి. నేడు వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. సమాజాన్ని విభజించాలని చూసే శక్తులకు వ్యతిరేకంగా మనం ఐక్యంగా పోరాడాలి. ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి, స్వయంసమృద్ధి దిశగా వారిని ప్రేరేపించాలి. 2047 నాటికి వికసిత్ భారత్ సంకల్పంతో ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించాలి. ఈ లక్ష్యాల సాధన కోసం మనం మరింత చురుగ్గా వ్యవహరించాలి" అని ప్రధాని పేర్కొన్నారు.
ఈ దేశం భారతీయ సంస్కృతికి జన్మస్థలమని.. దేశ అస్తిత్వానికి ఇదే పునాది అని ప్రధాని ఉద్ఘాటించారు. చిన్మయ మిషన్ కృషితో నేడు లక్షలాది మంది యువకులు భారతదేశానికి సాంస్కృతిక బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. కాగా, స్వామి చిన్మయానంద 1951లో స్థాపించిన చిన్మయ మిషన్ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటూ సాగే ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి దాదాపు 9 వేల మందికిపైగా ప్రతినిధులు హాజరుకానున్నారు.
Also Read..
యూపీ ఓటర్ల జాబితాలో విచిత్రమైన పేర్లు.. తండ్రి పేరు స్థానంలో B.Com
సీజేపీకి ఎప్పటికీ మద్దతు ఇవ్వబోం.. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతాం : అన్నామలై
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నాయి : ఐటీబీపీ చీఫ్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Annamalai | సీజేపీకి ఎప్పటికీ మద్దతు ఇవ్వబోం.. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతాం : అన్నామలై
అక్టోబర్ 23, 2026

PM Modi Donald Tusk Meeting | భారత్తో పోలాండ్ కీలక డీల్.. ఈ 3 రంగాల్లో ఇక తిరుగుండదు!
అక్టోబర్ 22, 2026

Mallikarjun Kharge | ప్రస్తుత సీట్లలోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయొచ్చు : ఖర్గే
అక్టోబర్ 21, 2026
తాజావార్తలు
- ●Ration Rice | తెలంగాణలో 42 వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం మాయం
- ●Rukmini Vasanth | హిట్టు కోసం జానర్ మార్చిన ఎన్టీఆర్ హీరోయిన్ - లేడీ ఓరియెంటెడ్ కథలో..
- ●ED Raids | తెలంగాణ, ఏపీలో మరోసారి ఈడీ మెరుపుదాడులు..
- ●UP MLC Elections | యూపీ ఓటర్ల జాబితాలో విచిత్రమైన పేర్లు.. తండ్రి పేరు స్థానంలో B.Com
- ●Ponnam Prabhakar | పట్టభద్రులు తమ పేర్లను ఓటర్లుగా నమోదుచేసుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●ITBP | అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నాయి : ఐటీబీపీ చీఫ్
Ration Rice | తెలంగాణలో 42 వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం మాయం

Rukmini Vasanth | హిట్టు కోసం జానర్ మార్చిన ఎన్టీఆర్ హీరోయిన్ - లేడీ ఓరియెంటెడ్ కథలో..

ED Raids | తెలంగాణ, ఏపీలో మరోసారి ఈడీ మెరుపుదాడులు..

UP MLC Elections | యూపీ ఓటర్ల జాబితాలో విచిత్రమైన పేర్లు.. తండ్రి పేరు స్థానంలో B.Com



