ED Raids | తెలంగాణ, ఏపీలో మరోసారి ఈడీ మెరుపుదాడులు..
ED Raids | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరోసారి ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) మెరుపు దాడులు నిర్వహించింది. హైదరాబాద్, విజయవాడ సహా రెండు రాష్ట్రాల్లో కలిపి 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.
పీఎంఎల్ఏ కింద కేసు నమోదు
ED Raids | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరోసారి ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) మెరుపు దాడులు నిర్వహించింది. హైదరాబాద్, విజయవాడ సహా రెండు రాష్ట్రాల్లో కలిపి 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్రలోని పుణె సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ సోదాలు నిర్వహించింది. పీఎంఎల్ఏ కింద కేసులు నమోదు చేసింది.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, మోసపూరిత ఇన్‌వెస్ట్‌మెంట్ యాప్‌ల రాకెట్‌పై దర్యాప్తు సంస్థ గురి పెట్టింది. సామాన్యులకు ఆశ చూపి వందల కోట్ల రూపాయలను అంతర్ రాష్ట్ర ముఠాలు కొల్లగొట్టినట్లు తేలింది. గత వారమే ఉత్తరాదిలోని ఢిల్లీ, ముంబై, గుర్గావ్‌లలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది ఈడీ. నార్త్ ఇండియా సోదాల్లో దొరికిన లింకులతో తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెంట్లు, హవాలా ఆపరేటర్లపై తనిఖీలు నిర్వహించారు. బెట్టింగ్ సొమ్మును షెల్ కంపెనీలు, క్రిప్టోకరెన్సీల ద్వారా విదేశాలకు తరలించినట్లు ఈడీ గుర్తించింది. కీలక నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో రికార్డులు, లావాదేవీల పత్రాలు, డిజిటల్ పరికరాలను అధికారులు పరిశీలించారు. ఈ సోదాల్లో భారీగా నగదు, బ్యాంకు ఖాతాలు, హవాలా నెట్‌వర్క్ ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం.
తాజావార్తలు
- ●UP MLC Elections | యూపీ ఓటర్ల జాబితాలో విచిత్రమైన పేర్లు.. తండ్రి పేరు స్థానంలో B.Com
- ●Ponnam Prabhakar | పట్టభద్రులు తమ పేర్లను ఓటర్లుగా నమోదుచేసుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●ITBP | అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నాయి : ఐటీబీపీ చీఫ్
- ●Revanth Reddy | సురక్షితమైన దక్షిణ భారతదేశాన్ని నిర్మిద్దాం: సీఎం రేవంత్
- ●India Files | అద్దంకి దయాకర్ హీరోగా `ఇండియా ఫైల్స్`.. అమెరికాలో ఘనంగా టీజర్ లాంచ్
- ●Annamalai | సీజేపీకి ఎప్పటికీ మద్దతు ఇవ్వబోం.. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతాం : అన్నామలై

UP MLC Elections | యూపీ ఓటర్ల జాబితాలో విచిత్రమైన పేర్లు.. తండ్రి పేరు స్థానంలో B.Com

Ponnam Prabhakar | పట్టభద్రులు తమ పేర్లను ఓటర్లుగా నమోదుచేసుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

ITBP | అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నాయి : ఐటీబీపీ చీఫ్

Revanth Reddy | సురక్షితమైన దక్షిణ భారతదేశాన్ని నిర్మిద్దాం: సీఎం రేవంత్





