UP MLC Elections | యూపీ ఓటర్ల జాబితాలో విచిత్రమైన పేర్లు.. తండ్రి పేరు స్థానంలో B.Com
UP MLC Elections | ఉత్తరప్రదేశ్ శాసనమండలి (MLC) ఎన్నికల ఓటర్ల జాబితాలో రామ్ నే యాదవ్ కో మారా (Ram ne Yadav ko maara), రామ్ నే శర్మ కో మారా (Ram ne Sharma ko maara) వంటి విచిత్రమైన పేర్లు వెలుగు చూశాయి. తండ్రి పేరు స్థానంలో ఏకంగా "B.Com" అని ఉండటంతో అభ్యర్థులను ఆశ్చర్యానికి గురి చేసింది.
UP MLC Elections | త్రినేత్ర న్యూస్ : ఉత్తరప్రదేశ్ శాసనమండలి (MLC) ఎన్నికల ఓటర్ల జాబితాలో అనేక లోపాలు చోటు చేసుకున్నాయి. ఓటర్ల జాబితాలో రామ్ నే యాదవ్ కో మారా (Ram ne Yadav ko maara), రామ్ నే శర్మ కో మారా (Ram ne Sharma ko maara) వంటి విచిత్రమైన పేర్లు వెలుగు చూశాయి. ఇక జాబితాలోని తండ్రి పేరు స్థానంలో ఏకంగా "B.Com" అని ఉండటంతో అభ్యర్థులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎన్నికల సంఘం (EC) తాజాగా స్పందించింది. ఈ తప్పులకు సాఫ్ట్‌వేర్ లోపమే కారణమని స్పష్టతనిచ్చింది.
గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను యూపీలో మొదటిసారిగా డిజిటల్ పద్ధతిలో రూపొందించారు. ఆన్‌లైన్ దరఖాస్తుల్లో ఇంగ్లీష్‌లో టైప్ చేసిన పేర్లను హిందీలోకి మార్చడానికి ఒక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారు. అయితే, ఈ సాఫ్ట్‌వేర్ ఇంగ్లీష్ అక్షరాల ఉచ్ఛారణను (Transliteration) కాకుండా, పదాల అర్థాన్ని నేరుగా హిందీలోకి అనువదించింది. దీంతో అనేక తప్పులు దొర్లాయి. ఎన్నడూ వినని విచిత్రమైన పేర్లు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం జరగనున్న 11 ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్‌కు ముందు.. ప్రయాగ్‌రాజ్-ఝాన్సీ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఈ లోపాలు బయటపడ్డాయి.
ఓటర్ల జాబితాలోని ఈ తప్పులకు సంబంధించిన జాబితా వివిధ సోషల్ మీడియా వేదికల్లో వైరల్‌గా మారాయి. దీంతో ఎన్నికల సంఘం స్పందించింది. 11 నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 14.81 లక్షల మంది ఓటర్లలో 158 ఎంట్రీలు మాత్రమే ఇలా తప్పుగా వచ్చాయని ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) నవ్‌దీప్ రిన్వా తెలిపారు. ఆన్‌లైన్‌లో ఓటర్ల జాబితా తయారీ కోసం కొత్తగా ప్రవేశపెట్టిన సాఫ్ట్‌వేర్ ద్వారా పేర్లను అనువదించే (Translation) సమయంలో ఈ పొరపాట్లు జరిగాయని వివరించారు. ఈ తప్పుల వల్ల ఓటు హక్కుపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. సదరు ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ అధికారిక గుర్తింపు కార్డులను చూపిస్తే ఓటు వేయడానికి అనుమతిస్తామని చెప్పారు. లోపాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఝాన్సీ డివిజనల్ కమిషనర్‌ను ఆదేశించారు.
Also Read..
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నాయి : ఐటీబీపీ చీఫ్
భానుడి భగభగలు.. 50 వేల మంది మృత్యువాత.. వాతావరణ మార్పులే కారణమంటున్న పరిశోధకులు
సీజేపీకి ఎప్పటికీ మద్దతు ఇవ్వబోం.. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతాం : అన్నామలై
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | పట్టభద్రులు తమ పేర్లను ఓటర్లుగా నమోదుచేసుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●ITBP | అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నాయి : ఐటీబీపీ చీఫ్
- ●Revanth Reddy | సురక్షితమైన దక్షిణ భారతదేశాన్ని నిర్మిద్దాం: సీఎం రేవంత్
- ●India Files | అద్దంకి దయాకర్ హీరోగా `ఇండియా ఫైల్స్`.. అమెరికాలో ఘనంగా టీజర్ లాంచ్
- ●Annamalai | సీజేపీకి ఎప్పటికీ మద్దతు ఇవ్వబోం.. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతాం : అన్నామలై
- ●Journalist Shankar | జర్నలిస్ట్ శంకర్ అరెస్టు అప్రజాస్వామికం: టీయూడబ్ల్యూజే

Ponnam Prabhakar | పట్టభద్రులు తమ పేర్లను ఓటర్లుగా నమోదుచేసుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

ITBP | అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నాయి : ఐటీబీపీ చీఫ్

Revanth Reddy | సురక్షితమైన దక్షిణ భారతదేశాన్ని నిర్మిద్దాం: సీఎం రేవంత్

India Files | అద్దంకి దయాకర్ హీరోగా `ఇండియా ఫైల్స్`.. అమెరికాలో ఘనంగా టీజర్ లాంచ్



