Samantha | అప్పుడు గెస్ట్ – ఇప్పుడు హీరోయిన్ – శింబుతో సమంత రొమాన్స్
నాలుగేళ్ల గ్యాప్ తర్వాత సమంత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. శింబు అరసన్ మూవీలో హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో శింబు విన్నైతాండి వరువాయా మూవీలో సమంత గెస్ట్ రోల్ చేసింది.
Entertainment | Published On Jan 24, 2026, 5.33 pm IST
Samantha | మయోసైటీస్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకుల కారణంగా రెండేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత మళ్లీ స్పీడు పెంచింది. గత ఏడాది శుభం సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించిన సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం పేరుతో ఓ క్రైమ్ కామెడీ మూవీ చేస్తోంది. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తోంది.
పీరియాడికల్ మూవీ...
తాజాగా తమిళంలో సమంత ఓ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. శింబు హీరోగా కోలీవుడ్ టాప్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ పేరుతో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
శింబు, వెట్రిమారన్ అరసన్ మూవీలో సమంత హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుతో పాటు తమిళంలో సమంతకు ఉన్న ఇమేజ్, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కథానాయికగా సమంత పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే మేకర్స్ ఆమెను అప్రోచ్ అయినట్లు సమాచారం. అయితే సమంత మాత్రం అరసన్ మూవీకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఆమె కబురు కోసం వెయిటింగ్‌లో ఉన్నారట.
అప్పుడు గెస్ట్ రోల్...
గతంలో శింబు హీరోగా నటించిన విన్నైతాండి వరువాయా లో సమంత గెస్ట్ రోల్‌లో నటించింది. తెలుగులో ఏ మాయ చేశావే పేరుతో ఈ సినిమా రిలీజైంది. ఈ ప్రేమకథా చిత్రంతోనే హీరోయిన్‌గా సమంత కెరీర్ మొదలైంది. అప్పుడు శింబు సినిమాలో గెస్ట్ రోల్ చేసిన సమంత ఇప్పుడు హీరోయిన్‌గా నటించనుండటం ఆసక్తికరంగా మారింది. అరసన్ మూవీతో నాలుగేళ్ల తర్వాత కోలీవుడ్‌లోకి సమంత రీఎంట్రీ ఇవ్వబోతుంది.
గత ఏడాది పెళ్లి...
గత ఏడాది డిసెంబర్‌లో రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది సమంత. పెళ్లికి ముందు రెండేళ్ల పాటు ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్‌తో ప్రేమలో ఉంది. ఇద్దరికి ఇది రెండో వివాహం. హిందీలో భర్త రాజ్ నిడిమోరు డైరెక్షన్‌లో రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్‌షిరీస్ చేసింది. హారర్ ఫాంటసీ సిరీస్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌కు రాజ్‌తో కలిసి డీకే దర్శకత్వం వహించాడు.
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Samantha | అందుకే రిస్క్ తీసుకున్నా – ప్రొడ్యూసర్‌గా మారడంపై సమంత కామెంట్స్
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



