త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIIMA Awards | ఉత్త‌మ న‌టుడిగా తేజ స‌జ్జా.. బెస్ట్ కమెడియ‌న్‌గా బుల్లిరాజు

SIIMA Awards | హ‌నుమాన్ మూవీలో న‌ట‌న‌తో ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న యువ హీరో తేజ స‌జ్జా (Teja Sajja) ద‌క్షిణ భార‌త‌దేశ‌ చల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించే సైమా అవార్డు (SIIMA Awards) ద‌క్కింది. గ‌తేడాది విడుద‌లైన మిరాయ్ (Mirai)సినిమాకు గాను ఉత్త‌మ న‌టుడిగా అవార్డు అందుకున్నాడు. సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీలోని న‌ట‌న‌కుగానూ ఐశ్వ‌ర్య రాజేశ్ (Aishwarya Rajesh) ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్‌) అవార్డును గెలుచుకుంది. ఇక బెస్ట్ క‌మెడియ‌న్‌గా సంక్రాతికి వ‌స్తున్నాం (Sankranthiki Vasthunam

G

Movies | Published On Sep 13, 2026, 9.27 am IST

SIIMA Awards | ఉత్త‌మ న‌టుడిగా తేజ స‌జ్జా.. బెస్ట్ కమెడియ‌న్‌గా బుల్లిరాజు
Advertisement

SIIMA Awards | త్రినేత్ర‌.న్యూస్‌: హ‌నుమాన్ మూవీలో న‌ట‌న‌తో ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న యువ హీరో తేజ స‌జ్జా (Teja Sajja) ద‌క్షిణ భార‌త‌దేశ‌ చల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించే సైమా అవార్డు (SIIMA Awards) ద‌క్కింది. గ‌తేడాది విడుద‌లైన మిరాయ్ (Mirai)సినిమాకు గాను ఉత్త‌మ న‌టుడిగా అవార్డు అందుకున్నాడు. సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీలోని న‌ట‌న‌కుగానూ ఐశ్వ‌ర్య రాజేశ్ (Aishwarya Rajesh) ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్‌) అవార్డును గెలుచుకుంది. ఇక బెస్ట్ క‌మెడియ‌న్‌గా సంక్రాతికి వ‌స్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమాలో త‌న న‌ట‌న‌తో హాస్యం పండించిన‌ బుల్లిరాజు అలియాస్ భీమ‌ల రేవంత్ నిలిచాడు. కాగా, గతేడాది కూడా తేజ సజ్జాకు సైమా అవార్డు దక్కింది. 2024లో ఆయన హీరోగా వచ్చిన హనుమాన్​కుగానూ తేజ సజ్జా ఉత్తమ నటుడు క్రిటిక్స్ విజేతగా నిలిచాడు.


బెంగ‌ళూరులోని కోర‌మంగ‌ళ ఇండోర్ స్టేడియంలో సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ (SIIMA) వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ద‌క్షిణాది సినీ తార‌లు సంద‌డి చేశారు. తెలుగు, క‌న్న‌డ‌, మూవీల్లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అవార్డుల‌ను అందుకున్నారు. `కాంతార: చాప్టర్ 1` చిత్రంలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ హీరో రిషబ్‌శెట్టి (Rishab Shetty) ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నాడు. మొత్తంగా మిరాయ్ సినిమాకు రెండు అవార్డులు రాగా, సంక్రాంతికి వ‌స్తున్నాం, కోర్ట్ సినిమాల‌కు మూవీకి నాలుగు చొప్పున అవార్డులు ద‌క్కాయి.

అవార్డులు వీరికే..

  • ఉత్తమ నటుడు - తేజ సజ్జా (మిరాయ్‌)
  • ఉత్తమ నటి - ఐశ్వర్య రాజేశ్‌ (సంక్రాంతికి వస్తున్నాం)
  • ఉత్త‌మ స‌హాయ‌న‌టుడు- స‌త్య‌దేవ్ (కింగ్డ‌మ్‌)
  • ఉత్త‌మ స‌హాయ న‌టి- శ్ర‌ద్ధా శ్రీనాథ్ (డాకు మ‌హ‌రాజ్‌)
  • ఉత్తమ హాస్య నటుడు - బుల్లిరాజు (సంక్రాంతికి వస్తున్నాం)
  • ఉత్త‌మ సినిమాటోగ్ర‌ఫీ- కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని (మిరాయ్‌)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు - రమణ గోగుల (సంక్రాంతికి వస్తున్నాం)
  • ఉత్తమ నేపథ్య గాయని - సమీరా భరద్వాజ్‌ (కోర్టు)
  • ఉత్త‌మ న‌టుడు (ప‌రిచ‌య‌)- హ‌ర్ష్ రోష‌న్ (కోర్ట్‌)
  • ఉత్తమ నటి (పరిచయ)- శ్రీదేవి (కోర్ట్‌)
  • ఉత్త‌మ న‌టి (ప‌రిచ‌య‌)- సాక్షి మడోల్కర్‌ (మోగ్లీ)
  • ఉత్త‌మ గేయ ర‌చ‌యిత‌- పూర్ణా చారి (కోర్ట్‌)
Advertisement
Advertisement