Zombie Reddy 2 | అఫీషియల్ – తేజా సజ్జా జాంబీరెడ్డి సీక్వెల్ కన్ఫామ్ – హీరోయిన్‌గా జాన్వీ కపూర్ చెల్లెలు!
ఫస్ట్ తెలుగు జాంబీ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను మెప్పించిన జాంబీరెడ్డి మూవీకి సీక్వెల్ రాబోతుంది. తేజా సజ్జా బర్త్‌డే సందర్భంగా ఈ సీక్వెల్‌ను ఆదివారం అనౌన్స్ చేశారు. జాంబీరెడ్డి నెక్స్ట్ లెవెల్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ షనయా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Zombie Reddy 2 | హీరో తేజా సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన జాంబీరెడ్డి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. తెలుగులో వచ్చిన ఫస్ట్ జాంబీ మూవీగా ప్రేక్షకులను మెప్పించింది. జాంబీరెడ్డి మూవీకి సీక్వెల్ రాబోతుంది. తేజా సజ్జా బర్త్‌డే సందర్భంగా ఈ సీక్వెల్‌ను ఆదివారం మేకర్స్ అఫీషియల్‌గా కన్ఫామ్ చేశారు. అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ చేశారు.
జాంబీరెడ్డి నెక్స్ట్ లెవెల్...
ఈ సీక్వెల్‌కు జాంబీరెడ్డి నెక్స్ట్ లెవెల్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జాంబీ రెడ్డి ఫస్ట్ పార్ట్ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగగా...సీక్వెల్ హైదరాబాద్ నేపథ్యంలో రూపొందనుంది. ఓ ఫ్లై ఓవర్‌పై కారు వెంట జాంబీలు పడటం, చార్మినార్‌ను చుట్టుముట్టినట్లుగా చూపించడం అనౌన్స్‌మెంట్ వీడియోలో ఆసక్తిని పంచుతోంది.
బాలీవుడ్ బ్యూటీ...
జాంబీరెడ్డి 2లో బాలీవుడ్ బ్యూటీ షనయా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జాన్వీ కపూర్‌కు వరుసకు సోదరి అయిన షనయా ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. కన్నడ హీరో ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2...
జాంబీ రెడ్డి సీక్వెల్‌కు ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. సూపర్న్ వర్మ దర్వకత్వం వహిస్తున్నాడు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, రానా నాయుడు వెబ్‌సిరీస్‌లను సూపర్న్ వర్మ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. తెలుగులో ఇదే అతడికి డెబ్యూ మూవీ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ జాంబీ రెడ్డి 2ను నిర్మిస్తోంది.
వచ్చే ఏడాది...
వచ్చే ఏడాది జాంబీ థ్రిల్లర్ మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం వరకు పూర్తయినట్లు సమాచారం. జాంబీరెడ్డి 2కు హరి గౌర దర్శకత్వం వహిస్తున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Varshini Sounderajan | బిగ్‌బాస్‌లోకి యాంకర్ వర్షిణి..! మరి ఈసారైనా బీబీ హౌస్‌లో అడుగుపెడుతుందా?
ఆగస్టు 23, 2026

Chiranjeevi | మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్ – ట్రెడిషనల్ థీమ్‌తో….
ఆగస్టు 23, 2026

Deepika Padukone | మళ్లీ తెరపైకి స్పిరిట్ వివాదం.. ఒక్క లైక్‌తో సందీప్‌రెడ్డి వంగాకు కౌంటర్ ఇచ్చిన దీపికా!
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●Bidesh Sikhyabruti scholarship | విదేశీ విద్యకు రూ.25 లక్షల సాయం.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు బంపరాఫర్
- ●Varshini Sounderajan | బిగ్‌బాస్‌లోకి యాంకర్ వర్షిణి..! మరి ఈసారైనా బీబీ హౌస్‌లో అడుగుపెడుతుందా?
- ●Ponnam Prabhakar | ఆటో కార్మికులారా! సమ్మె వద్దు.. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నం
- ●Alia Bhatt | ఈ ఏడాది బాలీవుడ్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ - ఓటీటీలోకి వచ్చేస్తోన్న అలియాభట్ స్పై థ్రిల్లర్ మూవీ
- ●India Robotic Telesurgery | వైద్యరంగంలో సంచలనం: గురుగ్రామ్‌లో డాక్టర్.. హైదరాబాద్‌లో పేషెంట్.. 1,600 కి.మీ దూరం నుంచి రోబోటిక్ సర్జరీ
- ●Chamala Kirankumar Reddy | సబ్జెక్ట్ ఉండదు.. నాలెడ్జ్ అసలే ఉండదు.. నోళ్లు మాత్రం లేస్తయ్

Bidesh Sikhyabruti scholarship | విదేశీ విద్యకు రూ.25 లక్షల సాయం.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు బంపరాఫర్

Varshini Sounderajan | బిగ్‌బాస్‌లోకి యాంకర్ వర్షిణి..! మరి ఈసారైనా బీబీ హౌస్‌లో అడుగుపెడుతుందా?

Ponnam Prabhakar | ఆటో కార్మికులారా! సమ్మె వద్దు.. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నం

Alia Bhatt | ఈ ఏడాది బాలీవుడ్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ - ఓటీటీలోకి వచ్చేస్తోన్న అలియాభట్ స్పై థ్రిల్లర్ మూవీ



