Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు
Passenger Ship | ఇండోనేషియాలోని (Indonesia) జావా సముద్రంలో (Java Sea) 240 మందితో ప్రయాణిస్తున్న నౌక గల్లంతైంది. ఈ నౌక (Passenger Ship) తూర్పు జావా (Java) నుంచి కాళీమంతన్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకొంది.
International | Published On Sep 13, 2026, 10.38 am IST
Passenger Ship | త్రినేత్ర.న్యూస్: ఇండోనేషియాలోని (Indonesia) జావా సముద్రంలో (Java Sea) 240 మందితో ప్రయాణిస్తున్న నౌక గల్లంతైంది. ఈ నౌక (Passenger Ship) తూర్పు జావా (Java) నుంచి కాళీమంతన్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకొంది. నౌకతో సంబంధాలు తెగిపోవడంతో అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8 నౌక (Virgo Transport 8) తూర్పు జావా ప్రావిన్స్‌లోని సురబాయ నుంచి బోర్నియో దీవిలోని దక్షిణ కాలిమంతాన్ ప్రావిన్స్ రాజధాని బంజర్‌మసిన్‌కు వెళ్‌తున్నది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో బంజార్‌మసన్ (Banjarmasin) నుంచి 148 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఒక్కసారిగా కమ్యూనికేషన్ తెగిపోయింది.

ఆదివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. త్రిశక్తి పోర్ట్ కేంద్రంగా తాము ఆపరేషన్ చేపట్టినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రాణనష్టానికి సంబంధించి సమాచారం లేదని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల కోసం ట్రిసక్తి ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. జావా సముద్ర జలాల్లో నేవీకి చెందిన బోట్లు, హెలికాప్టర్లను మోహరించి నౌక కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ప్రతికూల వాతావరణం, సముద్రంలో భారీ అలల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఎదురవుతోంది.
తాజావార్తలు
- ●Irumudi OTT | అఫీషియల్ - థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి - నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
- ●Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..
- ●SIIMA Awards | ఉత్తమ నటుడిగా తేజ సజ్జా.. బెస్ట్ కమెడియన్‌గా బుల్లిరాజు
- ●Brahmotsavalu 2026 | తిరుమల వెంకన్న తొమ్మిది రోజుల ఉత్సవం వెనుక వెయ్యేళ్ల చరిత్ర..!
- ●Heavy Rain | ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
- ●Uppal Ring Road | ఉప్పల్ రింగ్‌రోడ్డులో రెండు వైపుల తెరచుకున్న వరంగల్ రహదారులు

Irumudi OTT | అఫీషియల్ - థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి - నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్

Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..

SIIMA Awards | ఉత్తమ నటుడిగా తేజ సజ్జా.. బెస్ట్ కమెడియన్‌గా బుల్లిరాజు

Brahmotsavalu 2026 | తిరుమల వెంకన్న తొమ్మిది రోజుల ఉత్సవం వెనుక వెయ్యేళ్ల చరిత్ర..!






