Shruti Haasan | వరుస హిట్స్ తర్వాత గ్యాప్..! స్టార్‌డమ్ శృతి హాసన్‌ని నిలబెట్టేనా..?
Shruti Haasan | సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు ఒక సినిమా తర్వాత మరో సినిమాకు గ్యాప్ తీసుకున్నా వారి ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆయా హీరోల స్టార్‌డమ్ వారి అంత బలంగా నిలబడుతుంది. కానీ, హీరోయిన్స్ విషయంలో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది.
Entertainment | Published On Feb 25, 2026, 3.05 pm IST
Shruti Haasan | సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు ఒక సినిమా తర్వాత మరో సినిమాకు గ్యాప్ తీసుకున్నా వారి ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆయా హీరోల స్టార్‌డమ్ వారి అంత బలంగా నిలబడుతుంది. కానీ, హీరోయిన్స్ విషయంలో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. ఎంతటి క్రేజ్ ఉన్నా వరుసగా సినిమాలు చేయకపోతే ప్రేక్షకుల దృష్టి కొత్త హీరోయిన్స్ వైపు మళ్లే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది హీరోయిన్లు ఎప్పటికప్పుడు కనీసం ఒక సినిమా అయినా విడుదలయ్యేలా చూసుకుంటూ కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటారు. అయితే శృతి హాసన్ (Shruti Haasan) మాత్రం కొంత భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది.
ఆమె వరుసగా ప్రాజెక్టులు లైన్‌లో పెట్టినట్టు కనిపించకపోయినా.. తనకు నచ్చిన కథలు, తనకు సౌకర్యంగా అనిపించే సినిమాలకే ప్రాధాన్యం ఇస్తోందనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కెరీర్‌ను తొందరపడి ముందుకు వెళ్లకుండా.. సెలెక్టివ్‌గా ముందుకు సాగాలనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. 2023 శృతి హాసన్‌కు కలిసివచ్చింది. వరుసగా వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ మూవీలో నటించింది. ఈ మూడు చిత్రాలు వరుస విజయాలు సాధించడంతో శృతి హాసన్ పేరు మళ్లీ టాప్ లిస్ట్‌లో నిలిచింది. ముఖ్యంగా ‘సలార్’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులు మంచి గుర్తింపును తెచ్చాయి. అయితే, ఆ తర్వాత ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ తగ్గినట్టు అనిపిస్తోంది. 2025లో విడుదలైన కూలీలో కీలక పాత్రలో కనిపించింది. రజనీకాంత్‌కు కూతురుగా నటించింది. గత ఏడాదిలా వరుస చిత్రాల్లో నటించడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో సలార్ (Salaar 2) ఒకటి.
వీటితో పాటు ఇతర పలు చిత్రాలు చర్చల్లో నటించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇండస్ట్రీలో సాధారణంగా స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు రావాలనే అభిప్రాయం ఉంది. అయితే, శృతి హాసన్ మాత్రం పరిమిత సినిమాల ద్వారానే ఇంపాక్ట్ కొనసాగించాలనే వ్యూహాన్ని అనుసరిస్తోందా? అన్న చర్చ సాగుతోంది. భారీ ప్రాజెక్టులు మధ్యలో గ్యాప్ ఉన్నా, వాటి ప్రభావం సరిపోతుందా? లేక వరుస సినిమాలే అవసరమా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి శృతి హాసన్ కెరీర్ ఇప్పుడు ఒక కీలక దశలో ఉంది. రాబోయే విడుదలలు ఆమె ఎంపికల ఫలితాన్ని స్పష్టంగా చూపించనున్నాయి. సెలెక్టివ్ స్ట్రాటజీ సక్సెస్ అవుతుందా? లేక మరింత వేగం అవసరమా? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పనుంది.
Read Also :
రూ.300 కోట్ల హిట్ మూవీ సీక్వెల్.. లోక: 2పై క్లారిటీ ఇచ్చిన కళ్యాణి ప్రదర్శన్..!
Nayan Sarika | లాయర్ కావాలనుకున్నా.. సినిమాలపై ఇష్టం కెరీర్‌గా మారిందన్న నయన్ సారిక..!
Virosh Wedding | విరోష్ వెడ్డింగ్.. కాబోయే జంటకు ప్రత్యేక నోట్ పంపిన ప్రధాని మోదీ
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



