త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Web Series | చంద్ర‌యాన్‌పై వెబ్‌సిరీస్ – లీడ్ రోల్‌లో శ్రియా – స్ట్రీమింగ్ డేట్ ప్లాట్‌ఫామ్ ఇవే

మిష‌న్ చంద్ర‌యాన్‌పై హిందీలో ఓ వెబ్‌సిరీస్ రాబోతుంది. స్సేస్‌జెన్ చంద్ర‌యాన్ పేరుతో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్‌లో శ్రియా కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. జియో హాట్‌స్టార్‌లో జ‌న‌వ‌రి 23న ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ కాబోతుంది.

N

Entertainment | Published On Jan 6, 2026, 3.17 pm IST

Web Series | చంద్ర‌యాన్‌పై వెబ్‌సిరీస్ – లీడ్ రోల్‌లో శ్రియా – స్ట్రీమింగ్ డేట్ ప్లాట్‌ఫామ్ ఇవే
Advertisement

Web Series | భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన చంద్రయాన్ మిషన్‌పై హిందీలో ఓ వెబ్‌సిరీస్ రాబోతుంది. స్పేస్‌ జెన్ చంద్ర‌యాన్ పేరుతో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్ అయ్యాయి. ఈ సైంటిఫిక్ డ్రామా వెబ్‌సిరీస్ జియో హాట్ స్టార్‌లో జ‌న‌వ‌రి 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. హిందీతో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.
స్పేస్‌ జెన్ చంద్ర‌యాన్ వెబ్‌సిరీస్ టీజ‌ర్‌ను మేక‌ర్స్ మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు. చంద్ర‌యాన్ మిష‌న్ స‌క్సెస్ వెనుక ఇస్రో సైంటిస్టుల క‌ష్టం, వారు ఎదుర్కొన్న సంఘ‌ర్ష‌ణ‌ను ఆవిష్క‌రిస్తూ ఇంటెన్స్‌గా ఈ టీజ‌ర్ సాగింది. యాభై మూడు సెకండ్ల నిడివితో ఈ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. చంద్ర‌యాన్ మిష‌న్‌కు సంబంధించి తెర వెనుక ఏం జ‌రిగింది అన్న‌ది ఈ సిరీస్‌లో చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

శ్రియా లీడ్ రోల్‌...

స్పేస్‌ జెన్ చంద్ర‌యాన్ వెబ్‌సిరీస్‌లో న‌కుల్ మెహ‌తా, శ్రియా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ టీవీఎఫ్ నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌కు అనంత్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శుభం శ‌ర్మ‌, ప్ర‌శాంత్ కుమార్‌, నితిన్ తివారీ క‌థ‌ను అందిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌లో శ్రియా సైంటిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు టీజ‌ర్ చూస్తుంటే తెలుస్తోంది. టీవీఎఫ్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ సిరీస్‌గా స్పేస్‌జెన్ చంద్ర‌యాన్ వెబ్‌సిరీస్ రూపొందుతోంది.

మిరాయ్‌లో త‌ల్లి పాత్ర‌లో...

తెలుగులో ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా గుర్తింపును సొంతం చేసుకుంది శ్రియా. నేనున్నాను, ఛ‌త్ర‌ప‌తి, భ‌గీర‌థ ప‌లు సూప‌ర్‌హిట్ సినిమాల్లో క‌నిపించింది. యంగ్ హీరోయిన్ల జోరుతో పాటు ప‌రాజ‌యాల కార‌ణంగా త్రిష‌కు అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. దాంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారింది. గ‌త ఏడాది రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన మిరాయ్ మూవీలో తేజా స‌జ్జా త‌ల్లి పాత్ర‌లో క‌నిపించింది. ప్ర‌స్తుతం హిందీలో దృశ్యం 3 సినిమా చేస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement