త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kamal Haasan | పోలీసుల ర‌క్ష‌ణ‌లో షూటింగ్‌ – సీఎం స‌హాయ‌నిరాక‌ర‌ణ – వివాదాస్ప‌ద టైటిల్‌తో క‌మ‌ల్‌హాస‌న్ కొత్త మూవీ

క‌మ‌ల్‌హాస‌న్, ఎస్‌యూ అరుణ్ కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న కొత్త మూవీకి సండియార్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శుక్ర‌వారం రిలీజ్ చేశారు. అయితే సండియార్ అనే టైటిల్‌తో 22 ఏళ్ల క్రితం క‌మ‌ల్‌హాస‌న్ సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నించారు. అప్ప‌ట్లో ఈ పేరుపై పెద్ద గొడ‌వే న‌డిచింది. చివ‌ర‌కు సీఎం జోక్యం చేసుకోవాల్సివ‌చ్చింది...

N

Entertainment | Published On Nov 6, 2026, 6.48 pm IST

Kamal Haasan | పోలీసుల ర‌క్ష‌ణ‌లో షూటింగ్‌ – సీఎం స‌హాయ‌నిరాక‌ర‌ణ – వివాదాస్ప‌ద టైటిల్‌తో క‌మ‌ల్‌హాస‌న్ కొత్త మూవీ
Advertisement

Kamal Haasan |సండియార్‌...ఇర‌వై రెండేళ్ల క్రితం ఈ టైటిల్ కార‌ణంగా క‌మ‌ల్ హాస‌న్ చాలా ఇబ్బందులు, వివాదాల‌ను ఎదుర్కొన్నారు. చివ‌ర‌కు ఈ టైటిల్‌పై సీఎం కూడా జోక్యం చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. పోలీసుల ర‌క్ష‌ణలో షూటింగ్ చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నించారు క‌మ‌ల్‌హాస‌న్‌. అయినా కుద‌ర‌క‌పోవ‌డంతో టైటిల్ మార్చారు. అప్పుడు వ‌దులుకున్న టైటిల్‌తో ఇర‌వై రెండేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ సినిమా చేయ‌బోతున్నారు.

విరుమాండి...

క‌మ‌ల్‌హాస‌న్ కెరీర్‌లో విభిన్న‌మైన ప్ర‌య‌త్నంగా విరుమాండి నిలిచింది. 2004లో రిలీజైన ఈ సినిమాకు క‌మ‌ల్ హాస‌న్ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విరుమాండికి తొలుత సండియార్ అనే టైటిల్ పెట్టాల‌ని క‌మ‌ల్ అనుకున్నారు. ఈ పేరుపై ద‌ళిత నాయ‌కుల‌తో పాటు కొన్ని పొలిటిక‌ల్ పార్టీలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. షూటింగ్‌ను అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు.

జ‌య‌ల‌లిత సాయం...

వివాదం పెద్ద‌ది కావ‌డంతో అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత సాయాన్ని కోరారు క‌మ‌ల్‌హాస‌న్‌. సినిమా షూటింగ్‌కు పోలీసుల ర‌క్ష‌ణ కావాల‌ని అడిగారు. క‌మ‌ల్ అభ్య‌ర్థ‌న‌ను జ‌య‌ల‌లిత తిర‌స్క‌రించింది. ఎలాంటి సాయం చేయ‌లేమ‌ని తేల్చిచెప్పింది.దాంతో కొద్ది రోజుల పాటు సండియార్ షూటింగ్ ఆగిపోయింది. చివ‌ర‌కు ఈ సినిమా టైటిల్‌ను విరుమాండిగా మార్చుతున్న‌ట్లు ప్ర‌క‌టించి వివాదానికి వివాదానికి పుల్‌స్టాప్ పెట్టారు క‌మ‌ల్‌.

ఫ‌స్ట్ లుక్‌...

అప్పుడు ప‌క్క‌న‌పెట్టిన వివాదాస్ప‌ద టైటిల్‌తో ఇప్పుడు మ‌ళ్లీ కొత్త సినిమాను ప్ర‌క‌టించారు. క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా ఎస్‌యూ అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రివేంజ్ యాక్ష‌న్ మూవీ రాబోతుంది. ఈ సినిమాకు సండియార్ అనే పేరును క‌న్ఫామ్ చేశారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో చేతిలో రివాల్వ‌ర్‌తో ఇంటెన్స్ లుక్‌లో క‌మ‌ల్‌హాస‌న్ క‌నిపిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాకు క‌మ‌ల్‌హాస‌న్ నిర్మిస్తున్నారు. విల‌క్ష‌ణ న‌టుడు హీరోగా న‌టిస్తోన్న 237వ మూవీ ఇది.

 

 

Advertisement
Advertisement