Minister Sridhar Babu | గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌కు కేంద్రంగా హైదరాబాద్
Minister Sridhar Babu | గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌కు కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. అంతర్జాతీయ కంపెనీలు తమ కీలక కార్యకలాపాలు, పరిశోధన, ఉత్పత్తుల అభివృద్ధికి హైదరాబాద్‌ను గమ్యస్థానంగా ఎంచుకునేలా అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు.
- గ్లోబల్ కంపెనీల కార్యకలాపాల విస్తరణకు పూర్తి సహకారం
- జీసీసీలను గ్లోబల్ టెక్నాలజీ అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం
- పికో టెక్నాలజీ ఇండియా కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు
Minister Sridhar Babu | గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌కు కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. అంతర్జాతీయ కంపెనీలు తమ కీలక కార్యకలాపాలు, పరిశోధన, ఉత్పత్తుల అభివృద్ధికి హైదరాబాద్‌ను గమ్యస్థానంగా ఎంచుకునేలా అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. గ్లోబల్ కంపెనీల కార్యకలాపాల విస్తరణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. హైటెక్ సిటీలో న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న పికో టెక్నాలజీ ఇండియా కార్యాలయాన్ని శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి శ్రీధర్‌బాబు ప్రారంభించారు.
వంద జీసీసీల ఏర్పాటు లక్ష్యం..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రారంభంలో పికో సంస్థ ప్రతినిధులతో హైదరాబాద్‌లో పెట్టుబడులు, సంస్థ విస్తరణపై జరిపిన చర్చలు కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉందన్నారు. ఏడాది వ్యవధిలో నగరంలో 100 కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. జీసీసీలను కేవలం సంప్రదాయ సేవలకే పరిమితం చేయకుండా.. గ్లోబల్ టెక్నాలజీ అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఇంజినీరింగ్, అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి కీలక రంగాల్లోనూ అవి కీలక పాత్ర పోషించేలా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

యువతకు అంతర్జాతీయ అవకాశాలు
హైదరాబాద్‌లో పికో టెక్నాలజీ కార్యకలాపాల విస్తరణతో స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
ముప్పైకి పైగా దేశాల్లో పికో సేవలు
పికో టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్థలకు టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్‌వేర్, డేటా, అనలిటిక్స్ సేవలు అందిస్తోంది. 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ.. 350కి పైగా సంస్థలకు సేవలందిస్తోంది. కార్యక్రమంలో పికో టెక్నాలజీ వ్యవస్థాపకుడు, సీఈఓ జారోడ్ యూస్టర్, సీఐఓ సీతారాం గొర్రె, చీఫ్ పీపుల్ ఆఫీసర్ మాట్ నార్మన్ తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు స్టైపెండ్ పెంపు
- ●Meta Muse | మెటా మ్యూస్‌లో ఇక వాయిస్ చాటింగ్.. మాట్లాడే అవతార్లు కూడా..
- ●NEHS | ఉద్యోగులకు ఆస్పత్రుల్లో అడ్మిషన్లు నిరాకరిస్తే చర్యలు
- ●Salman Khan | "మాతృభూమి" సెన్సార్ కాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుందా? - రూమర్లపై సల్మాన్ ఖాన్ రియాక్షన్
- ●Tummal Nageshwar Rao | వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతాం.. రైతుల ఆదాయం పెంచుతాం..
- ●Cyber Criminals | సైబర్ నేరగాళ్లకు సమాజంలో చోటు లేదు.. జైళ్లలో మగ్గిపోవడమే వారికి సరైన శిక్ష : సుప్రీంకోర్టు

Ponnam Prabhakar | బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు స్టైపెండ్ పెంపు

Meta Muse | మెటా మ్యూస్‌లో ఇక వాయిస్ చాటింగ్.. మాట్లాడే అవతార్లు కూడా..

NEHS | ఉద్యోగులకు ఆస్పత్రుల్లో అడ్మిషన్లు నిరాకరిస్తే చర్యలు

Salman Khan | "మాతృభూమి" సెన్సార్ కాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుందా? - రూమర్లపై సల్మాన్ ఖాన్ రియాక్షన్




