త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | విడాకుల బాట‌లో నేష‌న‌ల్ క్ర‌ష్ – అభిమానుల‌కు ర‌ష్మిక ట్విస్ట్‌

ప్రేమించి పెళ్లి చేసుకున్న భ‌ర్త‌కు నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న విడాకులు ఇవ్వ‌బోతుంద‌ట. అదేంటి ర‌ష్మిక‌కు పెళ్లి కాలేదు..విడాకులు ఏంటి అనుకుంటున్నారా. రియ‌ల్ లైఫ్‌లో కాదు..రీల్ లైఫ్‌లో ఓ బాలీవుడ్ మూవీలో భ‌ర్త‌కు విడాకులు ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నించే మ‌హిళ‌గా ర‌ష్మిక క‌నిపించ‌బోతున్న‌ద‌ట‌.

N

Entertainment | Published On Feb 14, 2026, 3.44 pm IST

Rashmika Mandanna | విడాకుల బాట‌లో నేష‌న‌ల్ క్ర‌ష్ –  అభిమానుల‌కు ర‌ష్మిక ట్విస్ట్‌
Advertisement

Rashmika Mandanna |  పెళ్లి ముగింట వ‌రుస‌గా కొత్త సినిమాల‌ను అంగీక‌రిస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌ (Rashmika Mandanna ). ఇటీవ‌లే అల్లు అర్జున్‌(Allu Arjun), అట్లీ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టింది నేష‌న‌ల్ క్ర‌ష్‌. పుష్ప‌, పుష్ప 2 త‌ర్వాత ముచ్చ‌ట‌గా మూడోసారి బ‌న్నీకి జోడీగా క‌నిపించ‌బోతుంది. బాలీవుడ్‌లో కాక్‌టెయిల్ 2 షూటింగ్‌కు ప్యాక‌ప్ చెప్పిన ర‌ష్మిక మ‌రో ఇంట్రెస్టింగ్ మూవీకి ఓకే చెప్పింద‌ట‌.

బాలీవుడ్‌లో...

తాజాగా షాహిద్‌క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న హీరోహీరోయిన్లుగా అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ ఫిక్సైన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. రొమాంటిక్ కామెడీకి సైన్స్ ఫిక్ష‌న్‌ ఎలిమెంట్స్‌ను జోడించి ప్ర‌యోగాత్మ‌కంగా ఈ సినిమా సాగ‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇందులో షాహిద్ క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న భార్యాభ‌ర్త‌లుగా క‌నిపించ‌నున్నార‌ట‌. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల‌కు కార‌ణ‌మేమిట‌న్న‌ది ఫ‌న్‌తో స‌రికొత్త‌గా డైరెక్ట‌ర్ అమిత్ శ‌ర్మ ఇందులో చూపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

రొమాంటిక్ కామెడీ మూవీ...

ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో భ‌ర్త నుంచి విడాకులు తీసుకోవాల‌నే ప్ర‌య‌త్నించే మ‌హిళ‌గా ర‌ష్మిక క్యారెక్ట‌ర్ డిఫ‌రెంట్ షేడ్స్‌తో సాగుతుంద‌ని అంటున్నారు. ఓ సైంటిఫిక్ ప్ర‌యోగం కార‌ణంగా విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న ఆ భార్యాభ‌ర్త‌ల జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరిగాయి? తిరిగి వారిద్ద‌రూ ఎలా ఏక‌మ‌య్యార‌నే పాయింట్‌తో థ్రిల్లింగ్‌గా డైరెక్ట‌ర్ క‌థ‌ను రాసుకున్నార‌ట‌.

పెళ్లి త‌ర్వాత‌...

క‌థ‌తో పాటు త‌న క్యారెక్ట‌రైజేష‌న్‌ను అమిత్ శ‌ర్మ డిజైన్ చేసిన‌ తీరు న‌చ్చ‌డంతో ర‌ష్మిక మంద‌న్న ఈ బాలీవుడ్ మూవీని అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. పెళ్లి త‌ర్వాత మార్చి నుంచి ర‌ష్మిక మంద‌న్న ఈ బాలీవుడ్ మూవీ షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు చెబుతోన్నారు. షాహిద్ క‌పూర్‌తో ర‌ష్మిక చేస్తున్న రెండో సినిమా ఇది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన కాక్ టెయిల్ 2 రిలీజ్‌కు రెడీగా ఉంది.

ఉద‌య్‌పూర్ లో పెళ్లి...

విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్న పెళ్లి ఫిబ్ర‌వ‌రి 26న రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో జ‌రుగ‌నుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే పెళ్లి ఏర్పాట్లు మొద‌లైన‌ట్లు స‌మాచారం. అయితే పెళ్లిపై విజ‌య్‌, ర‌ష్మిక మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌లేదు. మార్చి 4న హైద‌రాబాద్‌లో రిసెప్ష‌న్ ఏర్పాటుచేయ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. పెళ్లి కోసం కొద్ది రోజుల పాటు విజ‌య్‌, ర‌ష్మిక సినిమాల‌కు బ్రేక్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement
Advertisement