TG Weather | తెలంగాణలో వారం రోజులు అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!
TG Weather | తెలంగాణలో రాగల వారం రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు శనివారం పశ్చిమ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల నుంచి ఉపసంహరించుకున్నాయని తెలిపింది.
TG Weather | తెలంగాణలో రాగల వారం రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు శనివారం పశ్చిమ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల నుంచి ఉపసంహరించుకున్నాయని తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన నిన్నటి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, క్రమంగా బలపడి ఈ నెల 21 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా, 22 నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సెప్టెంబర్ 23 ఉదయం నాటికి దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల సమీపంలోని పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతాన్ని చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఒక తూర్పు - పశ్చిమ ద్రోణి సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, కోస్తాంధ్ర నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉత్తర-దక్షిణ ద్రోణి విస్తరించిందని వివరించింది.
తెలంగాణలో దంచికొట్టనున్న వానలు
ఈ నేపథ్యంలో శనివారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆదివారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. సోమవారం కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.
భారీ నుంచి అతిభారీ వర్షాలు
మంగళవారం భూపాలప్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఆస్కారం ఉందని చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బుధవారం పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు పడుతాయని తెలిపింది. అలాగే, గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.
సంబంధిత వార్తలు

MP Chamala Kirankumar Reddy | ఫిరంగి నాళాను ఆక్రమించి జన్వాడ ఫామ్‌హౌస్ కట్టారు
సెప్టెంబర్ 19, 2026

Special Trains | పండుగ వేళ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు
సెప్టెంబర్ 19, 2026

Tirumala Brahmotsavam 2026 | మోహినీ రూపంలో మలయప్ప.. మంత్రముగ్ధులైన భక్తజనం..! ఫొటో గ్యాలరీ
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●Roja | హీరో వెంకటేష్‌తో గొడవలు - షూటింగ్లో ఇబ్బంది పెట్టారంటూ మాజీ మంత్రి రోజా కామెంట్స్
- ●Mallu Ravi | జన్వాడ ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణ జరగాలి: ఎంపీ మల్లు రవి
- ●Cyber Fraud | బీజేపీ ఎమ్మెల్యే ఖాతా నుంచి రూ.1.50 లక్షలు మాయం
- ●MP Chamala Kirankumar Reddy | ఫిరంగి నాళాను ఆక్రమించి జన్వాడ ఫామ్‌హౌస్ కట్టారు
- ●Special Trains | పండుగ వేళ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు
- ●Lava Bold N4 Pro 5G | లావా బోల్డ్ ఎన్4 ప్రొ 5జి.. రూ.13,999కే.. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ..

Roja | హీరో వెంకటేష్‌తో గొడవలు - షూటింగ్లో ఇబ్బంది పెట్టారంటూ మాజీ మంత్రి రోజా కామెంట్స్

Mallu Ravi | జన్వాడ ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణ జరగాలి: ఎంపీ మల్లు రవి

Cyber Fraud | బీజేపీ ఎమ్మెల్యే ఖాతా నుంచి రూ.1.50 లక్షలు మాయం

MP Chamala Kirankumar Reddy | ఫిరంగి నాళాను ఆక్రమించి జన్వాడ ఫామ్‌హౌస్ కట్టారు



