త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yogi Babu | టాలీవుడ్ వ‌ర్సెస్‌ కోలీవుడ్ – టాప్ క‌మెడియ‌న్లుగా హీరోలుగా తెలుగు మూవీ – జాన‌ర్‌పై ట్విస్ట్‌?

కోలీవుడ్ క‌మెడియ‌న్ యోగిబాబు, టాలీవుడ్ అగ్ర హాస్య‌న‌టుడు స‌త్య కాంబినేష‌న్‌లో ఓ తెలుగు మూవీ రాబోతుంది. యాక్ష‌న్ కామెడీగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి గోల్డెన్ భాగ్యం అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమాకు రంగ‌బ‌లి ఫేమ్ ప‌వ‌న్ బాసంశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

N

Entertainment | Published On Sep 29, 2026, 4.11 pm IST

Yogi Babu | టాలీవుడ్ వ‌ర్సెస్‌ కోలీవుడ్ – టాప్ క‌మెడియ‌న్లుగా హీరోలుగా తెలుగు మూవీ – జాన‌ర్‌పై ట్విస్ట్‌?
Advertisement

Yogi Babu |  కోలీవుడ్‌లో టాప్ క‌మెడియ‌న్‌గా కొన‌సాగుతోన్నారు యోగిబాబు. విల‌క్ష‌ణ‌మైన‌ కామెడీ టైమింగ్‌తో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పిస్తోన్నారు స‌త్య‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ తెలుగు మూవీ రాబోతుంది. రంగ‌బ‌లి ఫేమ్ ప‌వ‌న్ బాసంశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ మంగ‌ళ‌వారం రిలీజైంది. ఈ సినిమాకు గోల్డెన్ భాగ్యం అనే పేరును ఖ‌రారు చేశారు.

గుండ‌మ్మ క‌థ‌...

టైటిల్‌ను రివీల్ చేస్తూ మేక‌ర్స్ రిలీజ్ చేసిన వీడియో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇందులో స‌త్య‌, యోగిబాబు త‌మ పంచ్‌ల‌తో న‌వ్వించారు. గుండ‌మ్మ క‌థ‌, మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారుతో పాటు ప‌లు మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌ను చూపిస్తూ స‌త్య‌, యోగిబాబు స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇవ్వ‌డం ఈ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది. స్టార్ హీరోల‌ను అనుక‌రిస్తూ వారి మ్యాన‌రిజ‌మ్స్ న‌వ్విస్తున్నాయి. ఈ గ్లింప్స్‌లో స‌త్య త‌మిళంలో, యోగిబాబు తెలుగులో మాట్లాడి ఆక‌ట్టుకున్నారు. ఈ క‌థ‌లో ల‌వ్‌స్టోరీ, క్రైమ్‌, యాక్ష‌న్ ఉంటాయ‌ని డైరెక్ట‌ర్ అన‌డం...స‌త్య‌, యోగిబాబు ఒక‌రిపై మ‌రొక‌రు వేసిన పంచ్‌ల‌తో గోల్డెన్ భాగ్యం టైటిల్‌ను అనౌన్స్‌చేశారు.

యాక్ష‌న్ కామెడీ...

యాక్ష‌న్ కామెడీగా గోల్డెన్ భాగ్యం మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే ప్రొడ్యూస‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ప‌వ‌న్ బాసంశెట్టి. ప‌వ‌న్ సీహెచ్‌, నితీష్ జాన్ మ్యూజిక్ అందించారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ మూవీ రూపొందుతోంది. స‌త్య, యోగిబాబు క‌మెడియ‌న్లుగా కొన‌సాగుతూనే అడ‌పాద‌డ‌పా హీరోలుగా సినిమాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement