త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

శ‌శిరేఖ సాంగ్‌కు 24 గంట‌ల్లో వ‌చ్చిన వ్యూస్ ఎన్నంటే? – లిరిక్స్ ఇవే

Sasirekha Song Lyrics | చిరంజీవి మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu)నుంచి ఆదివారం రిలీజైన శ‌శిరేఖ (Sasireka Song) సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇర‌వై నాలుగు గంట‌ల్లో 14.8 మిలియ‌న్ల వ‌ర‌కు ఈ సాంగ్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. చిరంజీవి రిలీజైన ఇర‌వై నాలుగు గంట‌ల్లో హ‌య్యెస్ట్ వ్యూస్ సొంతం చేసుకున్న సాంగ్‌గా నిలిచింది.

N

Entertainment | Published On Dec 8, 2025, 6.19 pm IST

శ‌శిరేఖ సాంగ్‌కు 24 గంట‌ల్లో వ‌చ్చిన వ్యూస్ ఎన్నంటే? –  లిరిక్స్ ఇవే

మన శంకర వరప్రసాద్ గారు

Advertisement

Sasirekha Song Lyrics | మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu) మూవీతో సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)). అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో మ‌రో టాలీవుడ్ హీరో వెంక‌టేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. చిరంజీవి, వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఫ‌స్ట్ మూవీ ఇదే కావ‌డంతో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారుపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.
ఇటీవ‌లే ఈ సినిమా నుంచి మీసాల పిల్లా సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫ‌స్ట్ సింగిల్ సెన్సేష‌న‌ల్‌గా నిలిచింది. ఆదివారం... సెకండ్ సాంగ్ వ‌చ్చేసింది. శ‌శిరేఖ అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్ కూడా మ్యూజిక్ ల‌వ‌ర్స్‌లోకి బాగానే ఎక్కేసింది. శ‌శిరేఖ (Sasirekha) ఓ మాట చెప్పాలి...అనే ప‌ల్ల‌వితో సాగిన ఈ సాంగ్ లో లిరిక్స్‌, చిరంజీవి, న‌య‌న‌తార కెమిస్ట్రీ, స్ట్పెప్పులు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. శ‌శిరేఖ పాట‌కు అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. మ‌ధుప్రియ‌తో క‌లిసి మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ ఈ సాంగ్‌ను ఆల‌పించాడు.
ఓవ‌రాల్‌గా శ‌శిరేఖ పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. యూట్యూబ్‌లో ఇర‌వై నాలుగు గంట‌ల్లో 14.8 మిలియ‌న్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 190కే వ‌ర‌కు లైక్స్ వ‌చ్చాయి. చిరంజీవి కెరీర్‌లో ఒక్క రోజులో హ‌య్యెస్ట్ వ్యూస్‌ను ద‌క్కించుకున్న లిరిక‌ల్ వీడియో సాంగ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ లిస్ట్‌లో రామ్ చ‌ర‌ణ్ చికిరి సాంగ్ టాప్ ప్లేస్‌లో ఉంది. చికిరి సాంగ్ ఇర‌వై నాలుగు గంట‌ల్లో 29 మిలియ‌న్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
అల్లు అర్జున్ పుష్ప 2లోని కిస్సిక్ (27 మిలియ‌న్ల వ్యూస్‌), రామ్‌చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌లోని నానా హైరానా (23 మిలియ‌న్ల వ్యూస్‌) టాప్ త్రీ ప్లేస్‌లో ఉన్నాయి.
కాగా మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారులో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా...క్యాథ‌రిన్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో వెంక‌టేష్ రోల్ ఇర‌వై నిమిషాల పాటు క‌నిపిస్తుంద‌ని రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి చెప్పాడు.
మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం చిరంజీవిపై ఓ మాస్ సాంగ్‌ను హైద‌రాబాద్‌లో షూట్ చేస్తున్నారు. ఈ పాట‌తో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌కు ప్యాక‌ప్ చెప్ప‌బోతున్నారు మేక‌ర్స్‌.

Advertisement

తాజావార్తలు

Advertisement