OTT | థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి సంక్రాంతి సినిమాలు – హిట్టైన కూడా నెలరోజుల్లోపే రిలీజ్
సంక్రాంతి సినిమాలు థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రాబోతున్నాయి. నారీ నారీ నడుమ మురారి ఫిబ్రవరి 4న రిలీజ్ అవుతోండగా...రాజాసాబ్ ఫిబ్రవరి 6న ఓటీటీలోకి వస్తోంది. తక్కువ గ్యాప్‌లో సంక్రాంతి మూవీస్ ఓటీటీలో రిలీజ్ కావడం టాలీవుడ్ వర్గాలను విస్మయపరుస్తోంది.
Entertainment | Published On Jan 31, 2026, 11.45 am IST
OTT | ఈ సంక్రాంతి టాలీవుడ్‌కు కలిసివచ్చింది. పండుగ బరిలో నిలిచిన ఐదు సినిమాల్లో మూడు నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. ప్రభాస్ రాజాసాబ్‌తో పాటు రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ డిజాస్టర్లుగా నిలిచాయి.
సంక్రాంతి విన్నర్‌గా...
ఈ సంక్రాంతి విన్నర్‌గా చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నాలుగు వందల కోట్ల వరకు వసూళ్లను దక్కించుకుంది. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారితో పాటు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలను తెచ్చిపెట్టాయి.
కాగా ఈ సంక్రాంతి సినిమాలు థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రాబోతున్నాయి. థియేట్రికల్, ఓటీటీ విడుదలకు మధ్య కనీసం మూడు వారాల గ్యాప్ కూడా లేకపోవడం సినీ లవర్స్‌తో పాటు టాలీవుడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. థియేటర్లలో ఆడుతుండగానే సంక్రాంతి సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్స్‌ను ప్రకటించడంతో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. ఇలాగైతే థియేటర్ల మనుగడ ప్రశార్థకమవుతుందని అంటున్నారు.
నారీ నారీ నడుమ మురారి...
శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. సరిగ్గా ఇరవై రోజుల వ్యవధిలోనే నారీ నారీ నడుమ మురారి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా పెద్ద హిట్టు అందుకున్నారు శర్వానంద్.
ప్రభాస్ రాజాసాబ్...
ప్రభాస్ రాజాసాబ్ మూవీ ఫిబ్రవరి 6న జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ అవుతోంది. హారర్ కామెడీగా రూపొందిన ఈ మూవీకి మారుతి డైరెక్టర్. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన రాజాసాబ్ డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. దారుణ పరాజయంతోనే ఈ సినిమాను త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
చిరంజీవి సినిమా...
చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు మూవీ కూడా నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5ఓటీటీ దక్కించుకుంది. ఫిబ్రవరి 11న ఈ ఫన్ ఫ్యామిలీ డ్రామా మూవీ ఓటీటీలో సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. థియేటర్లలో ఇప్పటికీ మన శంకర వరప్రసాద్‌గారు భారీగా వసూళ్లను రాబడుతోంది. ఓటీటీలోకి ఫిబ్రవరి నెలాఖరు వరకు రిలీజ్ చేస్తే మంచిదని థియేటర్ వర్గాలు అంటున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Comedy OTT | ఓటీటీలోకి తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ – సినిమా మొత్తం విమానంలోనే!
మే 17, 2026

Action OTT | 40 కోట్ల బడ్జెట్ – ఐదు కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి వచ్చిన తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ – తెలుగులో స్ట్రీమింగ్
మే 14, 2026

Telugu OTT | ఒకే రోజు రెండు ఓటీటీలలో రిలీజైన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



