Telugu OTT | ఒకే రోజు రెండు ఓటీటీలలో రిలీజైన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ
ప్రియదర్శి హీరోగా నటించిన లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ సుయోధన శుక్రవారం ఒకే రోజు రెండు ఓటీటీలలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు జియో హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ద్రిషిక చందర్ హీరోయిన్‌గానటించిన ఈ సినిమాలో సాయికుమార్, ప్రేమ కీలక పాత్రలు పోషించారు.
Entertainment | Published On Apr 17, 2026, 4.25 pm IST
Telugu OTT | కమెడియన్‌గా కెరీర్‌ను ప్రారంభించి హీరోగా మారాడు ప్రియదర్శి. బలగం, కోర్ట్ సినిమాలతో పెద్ద విజయాలను అందుకున్నాడు. కోర్ట్ తర్వాత కథల ఎంపికలో పొరపాట్ల కారణంగా హీరోగా ప్రియదర్శికి సరైన విజయాలు లేవు. ఇటీవలే సుయోధన పేరుతో ఓ సినిమా చేశాడు. కానీ థియేటర్లలోకి వచ్చిన విషయం తెలియకుండానే ఈ సినిమా వెళ్లిపోయింది. తాజాగా ఇరవై రోజుల గ్యాప్‌లోనే సుయోధన మూవీ ఓటీటీలోకి వచ్చింది.
శుక్రవారం రోజు రెండు ఓటీటీలలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు జియో హాట్‌స్టార్‌లలో సుయోధన స్ట్రీమింగ్ అవుతోంది.
సైకలాజికల్ థ్రిల్లర్...
సుయోధన మూవీలో ప్రియదర్శికి జోడీగా ద్రిషిక చందర్ హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నటుడు సాయికుమార్‌తో పాటు ప్రేమ కీలక పాత్రల్లో నటించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు.
ప్రియదర్శి, సాయికుమార్‌తో పాటు తెలుగు ఆడియెన్స్‌కు తెలిసిన నటులే సినిమాలో ఉన్నా...సరైన ప్రమోషన్స్ చేయకపోవడం, కాన్సెప్ట్ కన్ఫ్యూజింగ్‌గా ఉండటంతో సుయోధన డిజాస్టర్‌గా నిలిచింది. బలగం కంటే ముందు ప్రియదర్శి చేసిన సినిమా ఇది. షూటింగ్ డిలే వల్ల రిలీజ్ ఆలస్యం కావడం కూడా సినిమా పరాజయానికి కారణమైంది.
వరుణ్ డిజార్డర్...
వరుణ్ ఓ సౌండ్ డిజైనర్‌గా పనిచేస్తుంటాడు. వరుణ్‌కు ఏదైనా ప్రమాదం జరిగే ముందు సుయోధన అనే మాట వినిపిస్తుంటుంది. ఎవరి నుంచి అయితే ప్రాణహాని ఉందో ఆ వ్యక్తి దుర్యోధనుడి రూపంలో వరుణ్ ముందు ప్రత్యక్షమవుతుంటారు. ఓ సారి వరుణ్‌కు తండ్రి ప్రకాష్ దుర్యోధనుడి గెటప్‌లో కనిపిస్తాడు. అలా కనిపించిన కొద్ది సేపటికే ప్రకాష్ చనిపోతాడు. తండ్రి మర్డర్ కేసులో వరుణ్ నిందితుడిగా మారుతాడు? అసలు ప్రకాష్‌ను ఎవరు చంపారు? వరుణ్‌కు ఉన్న సమస్య ఏమిటి? అతడి లైఫ్‌లోకి మహతి ఎలా వచ్చింది అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






