Romanchakam Review | రోమాంచకం మూవీ రివ్యూ – డైరెక్టర్ సందీప్ వంగా యూత్‌ఫుల్ రొమాంటిక్ మూవీ ఎలా ఉందంటే?
జెన్‌జీ యుగంలో డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ప్రేమలే ఎక్కువ. యవ్వనంలోని వ్యామోహాలు, ఆకర్షణలతో డేటింగ్ యాప్‌లో దొరికే ప్రేమనే నిజమైనదిగా నమ్ముతుంటారు. లైఫ్ మొత్తం సరదాగా సాగిపోతుందని భ్రమలో బతుకుతుంటారు. ఆ భ్రమలకు ప్రతిరూపంగా రూపొందిన సినిమానే రోమాంచకం.
Entertainment | Published On Sep 3, 2026, 11.56 am IST
Romanchakam Review | యవ్వనం ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అందమైన దశ. చదువు పూర్తిచేసుకొని జీవితంలో ఎటు వైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధత ఉంటుంది. బాధ్యతలను స్వీకరించడంలో భయాలు, ప్రేమలు, ఆకర్షణలు, తప్పటడుగుల కారణంగా ఎదురయ్యే పరిణామాలతో యవ్వనం మొత్తం ఓ అడ్వెంచర్‌లా అనిస్తుంది. అందులో ఇది జెన్‌జీ యుగం. డేటింగ్ యాప్ ద్వారానే అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో పడుతున్నారు. పెళ్లి వరకు వస్తున్నారు. జీవితం మొత్తం ఇలాగే స్వేచ్ఛగా, సంతోషంగా సాగిపోతుందనే భ్రమలతో బతుకుతున్నారు. ఊహలకు నిజాలకు మధ్య సాగే వారి జీవితాన్ని రోమాంచకం మూవీలో దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు.
అన్వేష్....
అన్వేష్ పేరుకు తగ్గట్లే జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించే అన్వేషణలో ఉంటాడు. తల్లిదండ్రులు చెప్పిన ఉద్యోగం చేయడం అతడికి ఇష్టం ఉండదు. సొంతంగా ఓ డేటింగ్ యాప్ మొదలుపెట్టాలనే ప్రయత్నంలో ఉంటాడు. ఆ యాప్ ట్రయల్స్‌లో అతడికి మైథిలి పరిచయమవుతుంది. ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు కలుస్తాయి. ప్రేమలో పడతాడు. ఈ లవ్‌స్టోరీతో అన్వేష్ తన స్టార్టప్ కంపెనీ ఆలోచనలను పక్కనపెడతాడు.
ఎప్పుడూ మైథిలి లోకంలోనే మునిగిపోతాడు. ప్రియుడి కోసం ఇంట్లోవాళ్లకు చెప్పకుండా మైథిలి హైదరాబాద్ వస్తుంది. తన స్టార్టప్ కంపెనీ సక్సెస్ అయ్యిందని, తనకు హైదరాబాద్‌లో పెద్ద ఫ్లాట్ ఉందని మైథిలికి నోటికొచ్చిన అబద్దం చెబుతాడు అన్వేష్. అవన్నీ బయటపడతాయి. దాంతో ప్రియుడిపై కోపంతో ఓ లెటర్ రాసి పెట్టి మైథిలి అదృశ్యమవుతుంది. ప్రియురాలు ఏమైందో, ఎక్కడికి వెళ్లిందో తెలియని అయోమయంలో అన్వేష్ పడిపోతాడు. అతడికి సాయం చేసిన స్నేహితులు సైతం చిక్కుల్లో పడతాడు. మైథిలి జాడకనిపెట్టే ప్రయత్నంలో ఓ పోలీస్ ఆఫీసర్‌కు టార్గెట్‌గా మారుతారు. మైథిలి జాడను అన్వేష్ ఎలా కనిపెట్టాడు? మైథిలి మిస్సింగ్‌కు కారణమేమిటి? మైథిలి ప్రేమను అపార్థం చేసుకున్న అన్వేష్ ఎలా రియలైజ్ అయ్యాడు అన్నదే మిగిలిన కథ.
యూత్‌ఫుల్ రొమాంటిక్....
యూత్‌ఫుల్ రొమాంటిక్ కథలన్నీ ఒకే ఫార్మెట్‌లో సాగుతాయి. హీరోహీరోయిన్లు ప్రేమలో పడటం, అంతా బాగానే సాగుతుందనుకునే టైమ్‌లో ఏదో ఒక ట్విస్ట్‌తో విడిపోవడం, చివరకు మళ్లీ ఒక్కటవ్వడం... ఇవే లైన్స్‌తో ఉంటాయి. హీరోహీరోయిన్లు, వారికి ఎదురయ్యే పరిణామాలు మాత్రమే వేరుగా ఉంటాయి. రోమాంచకం ఈ రొటీన్ ఫార్మెట్‌లోనే సాగుతుంది.
జెన్‌జీ ఆడియెన్స్...
జెన్‌జీ ఆడియెన్స్ మనోభావాలకు తగ్గట్లుగా డేటింగ్ యాప్‌లు, స్నేహితులతో సరదాలు, పార్టీల చుట్టూ ఈ కథను అల్లుకున్నారు డైరెక్టర్. చెప్పుకోవడానికి ఇందులో పెద్దగా కథంటూ లేదు. నిజజీవితంలో జెన్‌జీ బ్యాచ్ ఆలోచనలు, వారి ప్రవర్తనలు ఎలా ఉంటాయో వాటినే వాటినే స్క్రీన్‌పై యథాతథంగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రతి సిట్యూవేషన్‌ను ఫన్నీగా రాసుకున్నారు. వాటి నుంచి జనరేట్ అయ్యే కామెడీతో ఆడియెన్స్‌ను నవ్వించే ప్రయత్నం చేశారు.
కామెడీతో...
కథతో కాకుండా కామెడీతోనే గట్టెక్కాలనే దర్శకుడి తపన అడుగడుగునా కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ ఎపిసోడ్స్, ప్రియురాలు మిస్సయ్యిందనే టెన్షన్‌లో హీరో ఉండగా అతడి స్నేహితులు వేసే పంచ్‌లు, హీరోయిన్ పెళ్లి అనుకొని ఆమె స్నేహితురాలి పెళ్లిని చెడగొట్టేందుకు హీరో అండ్ గ్యాంగ్ వేసే ప్లాన్‌లు యూత్‌కు కనెక్ట్ అవుతాయి.
తెలంగాణ యాసలో....
జెన్‌జీ యూత్‌గా హీరోహీరోయిన్లు ఇద్దరూ బాగా సెట్టయ్యారు. వారిది యాక్టింగ్ అనే భావన ఎక్కడ కనిపించదు. ఈ సినిమాకు నరేంద్ర రవి అసలైన హీరోలా నిలిచాడు. తెలంగాణ యాసలో అతడి కామెడీ టైమింగ్, పంచ్‌లు నవ్విస్తాయి. వెంకటేష్ కాకుమాను, జాతిరత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్, ఉపేంద్ర లిమాయోతో పాటు ప్రతి పాత్ర సరదాగా ఉంటుంది. మెసేజ్‌లు ఇచ్చే క్యారెక్టర్లు, సెంటిమెంట్‌తో గుండెలను పిండేసే పాత్రలకు చోటివ్వలేదు.
రోమాంచకం పేరుకు తగ్గట్లే వెరైటీగా సాగే జెన్‌జీ లవ్‌స్టోరీ. యూత్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Dhruv Vikram | టాలీవుడ్ డైరెక్టర్‌తో వివాదం – దిగొచ్చిన ధృవ్ విక్రమ్
సెప్టెంబర్ 12, 2026

Adarsha Kutumbam | ఫ్యామిలీ మ్యాన్ .. యాక్షన్ బాట పడితే – ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చేసింది – రిలీజ్ డేట్‌పై క్లారిటీ
సెప్టెంబర్ 12, 2026

Rashmika Mandanna | ఎంఎస్‌సుబ్బులక్ష్మి పాత్ర కోసం రష్మిక స్పెషల్ ట్రైనింగ్ – బయోపిక్ లాంఛ్ ఎప్పుడంటే?
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
- ●TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
- ●TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!

Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు



