Samantha | రాష్ట్రపతి భవన్‌కు సమంత – బాలీవుడ్ సెలిబ్రిటీలతో కలిసి…
రాష్ట్రపతి భవన్ నుంచి టాలీవుడ్ హీరోయిన్ సమంతకు ఆహ్వానం అందించింది. రిపబ్లిక్ డే సందర్భంగా సోమవారం రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే తేనీటి విందులో సమంత పాల్గొననున్నట్లు తెలిసింది.
Entertainment | Published On Jan 26, 2026, 6.27 pm IST
Samantha | రాష్ట్రపతి భవన్ నుంచి టాలీవుడ్ హీరోయిన్ సమంతకు (Samantha) ప్రత్యేక ఆహ్వానం అందింది. బాలీవుడ్ ప్రముఖులతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో సమంత సందడి చేయబోతుంది. రిపబ్లిక్ డే వేడుకల అనంతరం ప్రతి ఏటా జనవరి 26న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఎట్‌హోమ్ పేరుతో తేనీటి విందు జరుగుతుంటుంది. ఈ వేడుకలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు రాష్ట్రపతి ఆతిథ్యం ఇస్తుంటారు. పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు కూడా తేనీటి విందులో పాల్గొంటుంటారు.
టాలీవుడ్ నుంచి....
ఈ ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే తేనీటి విందుకు టాలీవుడ్ హీరోయిన్ సమంతకు ఆహ్వానం అందినట్లు సమాచారం. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తరఫున బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు మరికొన్ని భాషలకు చెందిన ప్రముఖులకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. ఈ లిస్ట్‌లో సమంత కూడా ఉందట. ఆమెతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్, అతడి భార్య బాలీవుడ్ హీరో యామీ గౌతమ్ కూడా రాష్ట్రపతి తేనీటి విందుకు హాజరుకానున్నట్లు సమాచారం. టాలీవుడ్ నుంచి కేవలం సమంతకు మాత్రమే ఆహ్వానం అందినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగనుంది.
తెలుగులో...
ఇందులో ఐదు వందల నుంచి అరు వందల వరకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అటెండ్ కానున్నట్లు తెలిసింది. ఈ సారి ఎట్‌హోమ్ వేడుకకు సంబంధించిన ఇన్విటేషన్‌ను అష్టలక్ష్మి థీమ్‌తో స్పెషల్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం సమంత తెలుగులో మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత స్వయంగా నిర్మించబోతుంది. దాదాపు రెండేళ్ల తర్వాత సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






